కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా ఈ మధ్య కాలంలో అడుగులు ఎక్కువగా వేస్తుంది అనే చెప్పాలి. దేశ వ్యాప్తంగా కూడా పాలనలో మరింత పారదర్శకతను తీసుకురావడానికి, ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా మంత్రుల బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటన చేసాయి. 77 మంది మంత్రులను ఎనిమిది గ్రూపులుగా విభజించినట్లు వర్గాలు ప్రకటన చేసాయి. ఒక్కో గ్రూపులో 9 నుంచి 10 మంది మంత్రులు ఉంటారని.. గ్రూపు సమన్వయకర్తగా కేంద్ర కేబినెట్ మంత్రిని నియమించారని వర్గాలు తెలుపుతున్నాయి.

వీటి వల్ల... పాలనా వ్యవహారాలు మెరుగవుతాయని, మంత్రుల పని సులభతరం అవుతుందని విశ్వసనీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 'చింతన్ శివిర్' పేరుతో.. గత కొన్ని రోజులుగా ప్రధాని స్వయంగా కసరత్తు చేసి మంత్రుల బృందాలు విభజన చేసినట్లు తెలుస్తుంది. చింతన్ శివిర్.. ప్రతి సమావేశం దాదాపు ఐదు గంటల పాటు కొనసాగిందని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు మొత్తం ఐదు సార్లు చింతన్ శివిర్ సెషన్‌ లు జరిగగా.. ఒక్కో భేటీలో ఒక్కో అంశాన్ని చర్చకు తీసుకున్నట్లు  వార్తలు వస్తున్నాయి.

వ్యక్తిగత సమర్థత, కేంద్రీకృత అమలు విధానం, మంత్రిత్వ శాఖ పనితీరు, భాగస్వామ్య దారులు, వాతాదారులతో సమన్వయం, కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాల అమలులో ప్రభుత్వం, పార్టీ కలిసి ముందుకు సాగేలా పార్టీతో సమన్వయం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ వంటి అంశాలపై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. పార్లమెంటరీ పద్ధతులపై ప్రత్యేకంగా ఒక చింతన్ శివిర్ లో చర్చించారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. చివరిగా జరిగిన మేధోమథన సమావేశానికి రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా  కూడా హాజరయ్యారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ మొత్తం సమావేశాలు ప్రభుత్వ పని తీరు మెరుగుతో పాటు... అనుకున్న ఫలితాలు సాధించే దిశగానే సాగినట్లుగా కేంద్ర ప్రభుత్వం అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: