టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌వ‌ర్గం కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ ఎన్నిక‌లో టీడీపీని ఓడించేందుకు వైసీపీ అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసింది. అందులో భాగంగానే దొంగ ఓట్లు భారీగా వేశార‌ని చంద్ర‌బాబు నాయుడు ఆరోపిస్తున్నారు. అస‌లు రాష్ట్రంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ ఉందా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దొంగ ఓట్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడేవాళ్ల‌పై లాఠీ చార్జ్ చేస్తారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు తిరుగుబాటు చేసే రోజులు తొంద‌ర‌లోనే వ‌స్తాయ‌ని ఆయ‌న చెప్పారు.

 
  అడుగ‌డున త‌మ పార్టీని ఓడించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అన్నారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తోంద‌ని, వ‌న్ సైడ్ యాక్ష‌న్ తీసుకుంటున్నార‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు. అయితే, కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓడిపోతుందని, టీడీపీ ఓడిపోతే చంద్ర‌బాబుకు ఇబ్బందిగా ఉంటుంద‌నే ఈ దొంగ‌నోట్ల విష‌యాన్ని ముందుకు తెస్తున్నార‌ని అధికార పార్టీ నేత‌లు అంటున్నారు.  కుప్పం మున్సిపాలిటీ ఏర్ప‌డిన త‌రువాత తొలిసారి మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గాయి.  ఈ కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌పై  టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక దృష్టి సారించారు.


   ప్ర‌చారం మొద‌లుకుని ఎన్నిక రోజు వ‌ర‌కు ఇప్పుడు కూడా స్వ‌యంగా చంద్ర‌బాబు ముందుండి అన్ని చూసుకుంటున్నాడు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక రోజు తీవ్ర ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయి. అడుగ‌డుగున గొడ‌వ‌లు చెల‌రేగాయి. దొంగ ఓట్లు వేశారంటూ టీడీపీ నేత‌లు ఎస్పీ కార్యాల‌యం ముందు ఆందోళ‌న‌కు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 80 శాతానికి పైగా ఓటింగ్ న‌మోద‌యిన‌ట్టు స‌మాచారం. అయితే, కుప్పం ఫ‌లితాల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తో పాటు ఆ పార్టీ నేత‌ల్లో టెన్ష‌న్ నెల‌కొన్న‌ట్టు తెలుస్తోంది. కుప్పంలో టీడీపీ ఓడిపోతే ఆ ప్ర‌భావం చంద్ర‌బాబు నాయుడి పై ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే, ఓడిపోతామ‌నే ఫ్ర‌స్టేష‌న్‌లో టీడీపీ నాయ‌కులు దొంగ ఓట్ల విష‌యాన్ని తెర‌పైకి తీసుకువ‌స్తున్నార‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: