ఈ సారి గోదావరి జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు జిల్లాల్లో వైసీపీ హవాని తగ్గించేందుకు ప్రతిపక్ష టీడీపీ అదిరిపోయే వ్యూహాలతో ముందుకెళుతుంది. ఎలాగైనా రెండుచోట్ల మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు టీడీపీ, జనసేనతో దోస్తీ పెట్టుకునేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో కొన్నిచోట్ల టీడీపీ-జనసేనలు కలిసి పనిచేసి వైసీపీకి చెక్ పెట్టాయి. ఇక ఇదే సీన్ వచ్చే ఎన్నికల్లో రిపీట్ చేయాలని చూస్తున్నారు.

అసలు గత ఎన్నికల్లోనే రెండు పార్టీలు కలిసి ఉంటే వైసీపీకి చెక్ పడేదనే విశ్లేషణలు ఉన్నాయి. ఎందుకంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చీల్చేసి టీడీపీకి డ్యామేజ్ చేసి వైసీపీకి బెనిఫిట్ చేసింది. అదే రెండు పార్టీలు కలిసి ఉంటే ఈ పరిస్తితి ఉండేది కాదు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని టీడీపీ-జనసేనలు రెడీ అవుతున్నాయి. రెండు జిల్లాల్లో వైసీపీకి చెక్ పెట్టడానికి తమదైన శైలిలో వ్యూహాలు రెడీ చేసుకుంటున్నాయి.

అయితే ఆ రెండు పార్టీలు కలిస్తే వచ్చే ప్రమాదాన్ని వైసీపీ సైతం ముందుగానే ఊహించి అందుకు తగ్గ వ్యూహాలతో ముందుకెళ్ళేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రెండు పార్టీలు పొత్తు లేకపోతే దానికి తగ్గట్టుగా రాజకీయం చేయనుంది. ఇక రెండు పార్టీలు పొత్తుతో మున్ద్కొస్తే...అందుకు తగ్గట్టుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి వైసీపీ రెడీ అవుతుంది.

రెండు పార్టీలు కలిస్తే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి చెక్ పడిపోవడం దాదాపు ఖాయం...అందుకే అలాంటి నియోజకవర్గాల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్ళేందుకు వైసీపీ రెడీ అవుతుంది. అవసరమైతే కొన్ని చోట్ల నాయకులని మార్చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని మార్చేసి వేరే బలమైన నాయకులకు సీటు ఇచ్చేందుకు కూడా వైసీపీ రెడీగా ఉందని తెలుస్తోంది. అంటే టీడీపీ-జనసేనల పొత్తు ఉంటే కొందరు ఎమ్మెల్యేలకు నెక్స్ట్ సీట్లు దక్కడం కష్టమే అని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: