తండ్రి వైఎస్ వ‌ల్ల కానిది.. నేడు జ‌గ‌న్ చేసి చూపించాడు. వైఎస్ ఉన్న‌ప్ప‌టి నుంచే చంద్ర‌బాబు పులివెందుల‌లో వైఎస్ ను ఎలా ఓడించాలా ? అని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉండేవారు. ఓ సారి ఎంపీ ఎన్నిక‌ల్లో వైఎస్ చ‌చ్చీ చెడీ కేవ‌లం 4 వేల ఓట్ల మెజార్టీ తో మాత్ర‌మే విజ‌యం సాధించారు. అదే వైఎస్ పై చంద్ర‌బాబు సాధించిన గొప్ప విజ‌యం. ఆ త‌ర్వాత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌తి సారి వైఎస్ మెజార్టీ పెరుగుతూ వ‌చ్చేది. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత కూడా పులివెందుల ఆ ఫ్యామిలీకి కంచుకోట‌గా ఉంటూ వ‌చ్చేది.

ఉప ఎన్నిక‌ల్లో ఓ సారి విజ‌య‌మ్మ ఏక‌గ్రీవంగా గెలిచారు. ఆ త‌ర్వాత వైసీపీ ఆవిర్భావం త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఆమె భారీ మెజార్టీ తో ఘ‌న‌విజ‌యం సాధించారు. ఇక 2014 తో పాటు 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ బంప‌ర్ మెజార్టీ తో పులివెందుల నుంచి ఘ‌న‌విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో అయితే రాష్ట్రం లోనే జ‌గ‌న్‌కు ఎక్కువ మెజార్టీ వ‌చ్చింది. పులివెందుల లో జ‌గ‌న్ ఏకంగా 90 వేల ఓట్ల పై చిలుకు మెజార్టీ తో ఘ‌న‌విజ‌యం సాధించారు.

నాడు వైఎస్ కూడా బాబు కంచుకోట కుప్పంను టార్గెట్ చేయాల‌ని చాలా ప్ర‌య‌త్నాలే చేశారు. అయితే అవేవి అప్పుడు ఫ‌లించ లేదు. అయితే ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ హ‌యాం లో మాత్రం బాబుకు కుప్పం లో చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయి. చంద్ర‌బాబు కుప్పంకు 30 ఏళ్లు ఎమ్మెల్యే.. పైగా 14 ఏళ్లు ముఖ్య‌మంత్రి గా ఉన్నారు. చంద్రబాబు కుప్పం ని పంచాయితీగానే ఉంచారే తప్ప కనీసం మునిసిపాలిటీ స్థాయికి తీసుకురాలేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే కుప్పంను మున్సిపాల్టీ చేసేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న యాక్ష‌న్ ప్లాన్ స్టార్ట్ చేసి ఒక్కో ఎన్నిక‌ల్లో టీడీపీని చిత్తు చేసుకుంటూ వ‌స్తున్నారు. ఇప్పుడు కుప్పంలో బాబు బేల చూపులు చూసే ప‌రిస్థితి వ‌చ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: