గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరియు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీల మధ్య వడ్ల కొనుగోలు పంచాయితీ కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. వడ్లు కొనడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నొక్కి చెబుతూ ఉంటే... తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రం కేంద్ర ప్రభుత్వం తప్పేమీ లేదని వాదిస్తున్నారు. దీంతో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరియు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య వివాదం చెలరేగుతోంది. ప్రతిరోజు ప్రెస్మీట్లు పెడుతూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి కొనసాగిస్తున్నారు. తప్పు మీద అంటే మీదే అంటూ వాదన చేసుకుంటున్నారు నాయకులు. 

ఈ ధాన్యం కొనుగోలు అంశంపై నిన్న నల్లగొండ మరియు సూర్యాపేట జిల్లాలో పర్యటించారు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ జిల్లా పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్. దీంతో బండి సంజయ్ కుమార్ పర్యటనలో అడుగడుగునా అడ్డుకున్నారు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు. అంతేకాదు బండి సంజయ్ కుమార్ గో బ్యాక్ అంటూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఇలా రోజంతా బండి సంజయ్ పర్యటనకు ఆటంకం కలిగించారు అధికారం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు. ఇక చివరగా... సాయంత్రం పూట బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్ళు మరియు కోడిగుడ్లతో దాడి చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు.

ఇక నిన్నటి దాడిపై.. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు అధికార టీఆర్ఎస్ పార్టీ పై ఫైర్ అయ్యారు. బండి సంజయ్ కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ నిర్వహించి మరీ సీఎం కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కచ్చితంగా సీఎం కేసీఆర్ అవినీతి ని బయటికి తీసి.. ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు బండి సంజయ్ కుమార్. అటు ఎంపీ అరవింద్ కూడా ఈ ఘటనపై స్పందించారు. టిఆర్ఎస్ పార్టీ ని బొంద తీసి పార్టీ పెడతామని వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp