కుప్పం మున్సిప‌ల్ ఎన్నికను టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అయితే, త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో చంద్ర‌బాబు కుప్పంపై ఫుల్ ఫోక‌స్ పెట్టారు. టీడీపీ గెలిస్తే స‌గ‌ర్వంగా ముందుకు వెళ్లేందుకు అవ‌కాశం ఉంటుంది. త‌మ పార్టీ ఇంకా మ‌నుగ‌డ‌లోనే ఉంద‌ని చెప్పుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లడానికి బాబుకు అనుకూలంగా మారుతుంది. అలాగే, క్యాడ‌ర్‌లో త‌మ పార్టీపై దీమా వ‌చ్చి భ‌యం తొల‌గిపోతుంది. దీంతో పార్టీ రానున్న కాలంలో పార్టీ పుంజుకుంటుంద‌నే ధైర్యం నిండుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఈ గెలుపు జోష్‌ను ఇస్తుంది. దీంతో ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్లోచ్చు.


   అలాగే, పార్టీ నేత‌లు ఎంత శ్ర‌మ పెట్టినా చంద్ర‌బాబు స్వ‌యంగా రంగంలోకి దిగితే ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయ‌నేది పార్టీలో కార్య‌క‌ర్త‌ల స్థాయి వ‌ర‌కు వెళ్తుంది. ఒకవేళ కుప్పంలో టీడీపీ ఓట‌మి పాల‌యితే.. తెలుగుదేశంలోని  ముఖ్య‌నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో అసంతృప్తి మొద‌ల‌వుతుంది. దీంతో పార్టీ బ‌ల‌హీన‌ప‌డిపోయే అవ‌కాశం ఏర్ప‌డుతుంది. రెండోది చంద్ర‌బాబు నాయుడు రాబోయే ఎన్నిక‌ల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ప్ర‌జ‌ల‌కు, పార్టీకి ప్ర‌తికూల సూచ‌న‌లు ఇచ్చిన‌ట్టు అవుతుంది.  రాబోయే కాలంలో చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం పై ఎక్కువ కాన్సంట్రేట్ చేయాల్సి వ‌స్తే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ దెబ్బ‌తినే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.


  అలాగే, కుప్పంలో టీడీపీ గెలిస్తే రేపు రాబోయే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన లేదా బీజేపీతో  ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే సీట్ల పంపాకాల్లో టీడీపీ పైచేయి ఉంటుంది. ఎందుకంటే గెలుపు గుర్రం పై అంచ‌నాలు ఎక్కువ‌గా ఉంటాయి. సీట్ల స‌ర్దుబాట్ల‌లో టీడీపీ చెప్పిందే ఫైన‌ల్ అవుతుంది. ఒక‌వేళ ఓడిపోతే త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే పార్టీని గెలిపించుకోలే అనే ప్ర‌భావంతో ఇత‌ర పార్టీలు డిమాండ్ చేసిన సిట్ల‌ను ఇవ్వాల్సి ఉంటుంది.  ప్ర‌జ‌లు కూడా టీడీపీ కి ప్ర‌త్యామ్నాయంగా మ‌రో పార్టీని చూస్తారు. మ‌రి కుప్పం ప్ర‌జ‌లు ఎలాంటి ఫ‌లితాలు ఇస్తారో చూడాలి.


 




మరింత సమాచారం తెలుసుకోండి: