ప్రపంచ ధనిక దేశం ఏదని అడిగితే టక్కున గుర్తుకువచ్చేది మాత్రం అమెరికానే . గడచినా రెండు దశాబ్దాలుగా అమెరికా ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తూవుంది. తాజాగా  మెక్‌కిన్సే అండ్ కో కన్సల్టెంట్ అనే అంతర్జాతీయ పరిశోధన సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం అమెరికాని కాస్త వెనకకు నెట్టి చైనా మొదటి స్థానాన్ని సాధించింది. 2000 సంవత్సరం లో ప్రపంచ సంపద 156 ట్రిలియన్ డాలర్లు ఉండగా అది 2020 నాటికీ 514 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. అయితే ఈ జాబితాలో 20 కంటే తక్కువ దేశాలు 60 శాతం కంటే  ఎక్కువ సంపదను సాధించాయి అని మెక్‌కిన్సే అండ్ కో కన్సల్టెంట్  సంస్థ వెల్లడించింది. అయితే ఈ లెక్కలప్రకారం గతం లో కంటే ప్రస్తుతం మనం రిచ్ " అని జాన్ మిష్కే అన్నారు(  జ్యూరిచ్‌లోని మెక్‌కిన్సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ అధికారి ) పేర్కొన్నారు.

 

అయితే ఈ పెరుగుదల మూడింట ఒక భాగం చైనా నుండి ఉంది . డబ్ల్యూ‌టీఓ లో చేరడానికి ముందు చైనా కేవలం $7 ట్రిలియన్లు ( 2000లో) కానీ అది ప్రస్తుత పరిస్థితులలో $120 ట్రిలియన్లకు పెరిగింది. దింతో చైనా  ఆర్థిక ప్రగతి శరవేగంగా దూసుకుపోతూవుంది. అయితే ఇక్కడ అమెరికా గురించి చెప్పుకోవాలి  అమెరికా నికర విలువ  $90 ట్రిలియన్లకు చేరుకుంది ఇది అసలు అమెరికా నికర విలువ రెట్టింపు కంటే ఎక్కువ. అయితే ఈ రెండు దేశాలలో మూడింట రెండువంతుల (10 %) కుటుంబాలు సంపన్న కుటుంబాలుగా ఉన్నాయ్ . వారి వాటా ఇంకా  పెరిగే  అవకాశం ఉంది . ప్రపంచ నికర విలువలో దాదాపు 68%  సంపద కేవలం రియల్ ఎస్టేట్లలోనే ఉంది . అంతే కాకున్నా మరికొన్ని అసంగతమైన వాటిలో కూడా ఈ సంపద దాగివుంది.చైనా ఇప్పటికే ఆహార కొరత తో బాధపడుతోంది. అయితే ఏవిధంగా నైనా చైనా ప్రజలకు ఆహార కొరత తీర్చవచ్చు  

మరింత సమాచారం తెలుసుకోండి: