దేశవ్యాప్తంగా సామూహిక కిచెన్ల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఆదేశాలు జారీ చేశారు. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ఉమ్మడి పథకాన్ని రూపొందించుకోవాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సమావేశం నిర్వహించిన సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని తెలపాలని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమావేశ ప్రణాళికలను మూడు వారాల్లోగా సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలతో సమావేశం నిర్వహించాలని పేర్కొంది. ఈ సమావేశానికి సంబంధించిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం సమావేశానికి పిలిచినప్పుడు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొంది. ప్రజలు ఆకలితో చనిపోతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ ద్వారా అఫిడవిట్ దాఖలు చేయడం అసంతృప్తికరమన్నారు.

ఇది పౌష్టికాహార లోపానికి సంబంధించిన అంశం కాదని, ప్రజల ఆకలికి సంబంధించిన అంశమని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ రెండు అంశాలను ఒక దానితో ఒకటి పోల్చవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏకరూప విధానం కావాలని, అందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ మేరకు కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు సూచనలు, సలహాలు తీసుకోవాలని పేర్కొన్నారు.


అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటా, ఆహార ధాన్యాల పంపిణీ తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. కమ్యూనిటి కిచెన్ కోసం ఉమ్మడి పథకాన్ని అమలు చేయడంపై కేంద్ర ప్రభుత్వ సీరియస్‌గా తీసుకోవడం లేదని ధ్వజమెత్తింది. 4 వారాల్లోపు కమ్యూనిటి కిచెన్ల ఏర్పాటుపై ప్రణాళికలు సమర్పించాలని పేర్కొంది. కాగా, ప్రణాళికలను వెంటనే సమర్పిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. సామూహిక కిచెన్ల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: