సి-130 హెర్క్యులస్ సైనిక రవాణా విమానం లో నరేంద్ర మోడీ పూర్వాంచల్ చేరుకున్నారు. ప్రధాన మంత్రి రాకకు కారణం లేకపోలేదు ఉత్తర్ ప్రదేశ్ లోని పూర్వాంచల్ లో నిర్మించిన  ఎక్స్ ప్రెస్ హైవే ని ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా   సి-130 హెర్క్యులస్ విమానం లో అక్కడకు చేరుకున్నారు. అయితే  సి-130 హెర్క్యులస్ సుల్తాన్ పూర్ జిల్లా కార్వాల్ ఖేరి లో పూర్వాంచల్ ఎక్ష్ప్రెస్స్ హై వే పై విమానం ల్యాండ్ అయ్యింది. ప్రధాని మంగళవారం నాడు ప్రారంభోత్సవం చేశారు. ఈ హైవే పొడవు దాదాపు 341 కి.మీ . ఈ ఎక్స్ ప్రెస్ హైవే  వల్ల ఘాజీపూర్ , లక్నో ల మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం 6 గంటలు ఉండగా అది ఇప్పుడు మూడు గంటలకు తగ్గనుంది. 



ఈ  ఎక్స్ ప్రెస్ హైవే ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. అయన మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పైన మరియు రాష్ట్ర ప్రజల సత్తా పైన అందరికి ఉన్న సందేహాలు ఇప్పుడు పటాపంచలయ్యాయని అయన పేర్కొన్నారు. సుల్తాన్ పూర్ లో అభివృద్ధి లేదని  వాపోతున్న  విమర్శకులు ఒకసారి సుల్తాన్  పూర్  లోని అభివృద్ధిని ఒక సరి పరిశీలించవలసిందిగా అయన కోరారు మరియు ఈమేరకు పిలుపునిచ్చారు. పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవే అనేది ఉత్తర్ ప్రదేశ్ కు గర్వకారం అని అయన పేర్కొన్నారు. రాష్ట్ర తూర్పు భాగం లో ఆర్ధిక అభివృధికి మరియు ఆర్ధిక పురోగతికి ఇది ఎంతగానో దోహదపడుతుంది అని అయన సభాముఖంగా పేర్కొన్నారు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే లో మొత్తం ఆరు లైన్లు ఉన్నాయ్ . వైమానిక విన్యాసాలు జరపడానికి మరియు యుద్ధ విమానాలు దిగడానికి ఈ రహదారులను ప్రత్యేకంగా నిర్మించారు. ఈ రహదారి వల్ల లక్నో నుండి బాక్సర్ కు ప్రయాణం  కేవలం 3 గం. కు తగ్గనుంది
.


IHG

మరింత సమాచారం తెలుసుకోండి: