కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన శబరిమలై గుడి తలుపులు ప్రతుతః లక్డౌన్ సడలింపులు కారణంగా దేవస్థానం తెరుచుకుంది. పల్లెల్లో , వాడ వాడల్లో ఎక్కడచూసినా అయ్యప్ప భక్తులు దీక్షలతో కనిపిస్తూ ఉన్నారు . ప్రతి పల్లెల్లో భక్తి పాటలతో ప్రజలను చీకటి జామునే నిదుర లేపుతున్నారు. దాదాపు చాలారోజుల తరువాత ఆలయాలు , గృహాలు అయ్యప్పస్వాములు దీక్షలతో కళకళలాడుతూ వున్నాయి. స్వాములు దీక్ష అనంతరం శబరిమలై వెళ్లి అక్కడ ముడుపులు సమర్పించుకుంటారు. ఈ క్రమంలో పేద ప్రజలు అక్కడి వరకు  కూడా వెళ్లలేని పరిస్థితి. అలంటి భక్తులకోసం తెలంగాణ ఆర్టీసీ వినూత్న ఆఫర్ ని ప్రకటించింది.

సజ్జనార్ నేతృత్వం లో తెలంగాణ ఆర్టీసీ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో పడింది .  కార్తీక మాసం సందర్భంగా కొన్ని ప్రత్యేక బస్సులను నడిపిన ఆర్టీసీ ప్రస్తుతం అయ్యప్ప స్వాముల కోసం శబరిమలై కి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపటానికి ముందుకొచ్చింది. ఈమేరకు తమ ట్విట్టర్ ఖాతాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ సారాంశం ఏమిటంటే ఎవరైతే సబరిమలైకి బస్సును బుక్  చేసుకుంటారో  వారితరుపున అదనంగా మరో ఐదుగురికి ఆ బస్సులో ఉచితంగా చోటు కల్పిస్తామని తెలిపింది.





 ఈ విషయానికి సంభందించి వరంగల్ 1 డిపో తమ ట్విట్టర్ ఖాతాలో ప్రచారం మొదలు పెట్టింది. అయితే బస్సు బుక్ చేసుకున్న అయ్యప్ప భక్తులతోపాటుగా ఇద్దరు వంటమనుషులు , ఒక అటెండర్ మరియు పదేళ్లలోపు ఇద్దరు మణికంఠ స్వాములకు ఫ్రీ గా శబరిమలై కొండకు తీసుకువెళ్లనున్నారు. అంటే మూడు ఫుల్ టిక్కెట్స్ మరియు వారితో పాటుగా రెండు ఆఫ్ టిక్కెట్లు ప్రయాణించేందుకు   ఆర్టీసీ ఎటువంటి ఛార్జ్ చేయడం లేదన్నమాట. అయితే ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం తో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ లో ప్రయాణం సురక్షితం కనుక భక్తులు ఇప్పటినుండి బుకింగ్ లు మొదలు పెట్టారు 


 

మరింత సమాచారం తెలుసుకోండి: