తెలంగాణలో ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి కాస్త ఆసక్తికర చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్సీ పదవుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి కీలకపాత్ర ఇస్తారు అనేది ఆసక్తికర చర్చ. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కొంతమంది విషయంలో ఆసక్తికర చర్చలు ఉన్నాయి. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ బలంగానే ఉన్నా సరే వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఈటెల రాజేంద్ర సొంత జిల్లా కావడంతో కాస్త ఈ జిల్లా మీద టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం సీరియస్ గానే ఫోకస్ పెట్టింది.

త్వరలోనే ఈ జిల్లా నుంచి కొంతమంది నాయకులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీతో కూడా కొంతమంది చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. అయితే ఈ జిల్లాకు చెందిన ఒక కీలక నాయకుడికి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారని అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు ఆలస్యమైనా సరే తర్వాత అయినా సరే ఖచ్చితంగా పదవి దక్కుతుందనే హామీని కేటీఆర్ ఇవ్వడంతో ఆయన చాలా నమ్మకంగా ఉన్నారు అని అంటున్నారు.

ఆర్థికంగా బలంగా ఉన్న సదరు నాయకుడు విషయంలో టీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులు కూడా చాలా సంతోషంగా ఉన్నారని కరీంనగర్ జిల్లాకు సంబంధించి పెద్దగా ఆయనను ఎవరూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు. కొన్ని కొన్ని విషయాల్లో మంత్రి కేటీఆర్ ఈ మధ్య కాలంలో కొంతమంది కీలక నాయకులు హామీలు నిలబెట్టుకోవడం తో సదరు నాయకుడు మంత్రి మాట ఎక్కువగా నమ్ముతున్నారని సమాచారం. అలాగే పాడి కౌశిక్ రెడ్డి కూడా కాస్త మంత్రి కేటీఆర్ పై చాలా సానుకూలంగా ఉన్నారని తన సన్నిహితులను కూడా టిఆర్ఎస్ పార్టీలో పదవులు ఇప్పించుకునేందుకు కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి భవిష్యత్ పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో ఎలా ఉంటుంది అనేది తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: