ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయాణానికి సంబంధించిన ఇప్పుడు ఆ పార్టీ నాయకులకు ఏమాత్రం కూడా స్పష్టత లేదు అనే విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది. రాజకీయంగా పార్టీని బలోపేతం చేసే విషయంలో పార్టీ నాయకత్వం పెద్దగా సమర్థవంతంగా వ్యవహరించడం లేదనే భావన కూడా ఉంది. కీలక నాయకులు ప్రజల్లోకి వెళ్లే అవసరం ఉన్నా సరే ప్రజలకు దూరంగా ఉండటం వంటి అంశాలతో పార్టీ అభాసుపాలవుతోంది. ఇక అమరావతి ఉద్యమానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ మధ్యకాలంలో దూరంగా ఉండటం ఇబ్బంది పెట్టే అంశంగా చెప్పుకోవచ్చు.

ప్రజల్లో ఆదరణ ఉన్నా లేకపోయినా సరే విపక్షాలన్నీ మద్దతిచ్చిన అప్పుడు అలాగే జనసేన పార్టీ కూడా ముందుకు వచ్చినప్పుడు కచ్చితంగా అమరావతి ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చి పాదయాత్ర లో పాల్గొనే ప్రయత్నం చేయాల్సి ఉందని అభిప్రాయం కొంత వరకు ఉంది. అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తూ అమరావతి మద్దతుగా మాట్లాడే వాళ్ళ మీద భారతీయ జనతా పార్టీలో చర్యలు తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.

అయితే సోమవారం అమిత్ షా ఇచ్చిన తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకులు అమరావతి పాదయాత్రలో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది రాష్ట్ర స్థాయి నాయకులు పాదయాత్రలో త్వరలోనే పాల్గొనే అవకాశాలు తో పాటుగా క్షేత్ర స్థాయి నాయకులు కూడా పాదయాత్రకు సహకారం అందించే అవకాశం ఉండవచ్చని అంటున్నారు.ప్రధానంగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అలాగే బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కృష్ణా జిల్లాకు చెందిన కామినేని శ్రీనివాస్ వంటి వాళ్ళు పాదయాత్రలో పాల్గొని అవకాశాలున్నాయని అంటున్నారు. వీరితో పాటుగా కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి అలాగే సీఎం రమేష్ కూడా పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: