కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి తెలంగాణ భారతీయ జనతా పార్టీ దూకుడుగా వెళ్లాల్సి ఉన్నా సరే సీఎం కేసీఆర్ ను సమర్ధవంతంగా ఇబ్బంది పెట్టడం లేదు అనే అభిప్రాయం చాలా వరకు వ్యక్తమవుతోంది. కొంతమంది తెలంగాణ బిజెపి నాయకులు వ్యక్తిగత విభేదాలతో పార్టీలో పైకి రావడం లేదు అనే భావన కూడా కొంత వరకు ఉంది. కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి అంటే వ్యక్తిగత విమర్శలు మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా బలంగా ఎదగాల్సిన అవసరం ఉంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా రాజకీయం చేస్తున్నారు.

కాబట్టి తెలంగాణ బిజెపి నాయకులు బండి సంజయ్ తరహాలో అన్ని జిల్లాల్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళితే పరిస్థితి మరో రకంగా ఉండేది. కానీ చాలామంది తెలంగాణ బిజెపి నాయకులు దానికి దూరంగా ఉండటంతో బండి సంజయ్ ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం కావడం ప్రజా ఉద్యమాలకు దూరం కావడం వంటి ఇప్పుడు ఇబ్బందికరంగా మారుతుంది.

మాజీ రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్రావు పెద్దగా మీడియా లో కనబడే ప్రయత్నం చేయడం లేదు అనే భావన కూడా ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకులు అందరితో సమ న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నా సరే కేవలం ఆయన ఢిల్లీకి మాత్రమే పరిమితం అవుతున్నారు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కేవలం విమర్శ కు మాత్రమే పరిమితం కావడం పట్ల బిజెపిలో భిన్నాభిప్రాయాలున్నాయి. మరి వీళ్ళు అందరూ ఎప్పుడూ మాట్లాడతారు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్లాలి పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తారు అనేది కాలమే సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: