టీ కాంగ్రెస్ లో బైపోల్ రచ్చ ఇంకా తేలడం లేదా..? ఢిల్లీకి వెళ్లిన నేతల రచ్చ తీరడం లేదా..? హైకమాండ్ దగ్గర కూడా రచ్చ ఆగలేదా..? ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది..? ఈ కాంగ్రెస్ గొడవ ఇప్పుడు సద్దుమణుగుతుంది..? రాబాద్ ఉప ఎన్నిక ఫలితం తో తెలంగాణ కాంగ్రెస్లో మొదలైన రచ్చ మరింత ముదురుతోంది. కొంతకాలంగా సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వల్లే హుజురాబాద్లో పార్టీకి డిపాజిట్ రాలేదని కొందరు సీనియర్లు ఆరోపించారు. ఈటల రాజేందర్ కు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయారని మరి కొందరు వ్యాఖ్యానించారు. తమపై వస్తున్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి టీం మాత్రం సైలెంట్ గానే ఉండిపోయింది. తాజాగా టీ కాంగ్రెస్ నేతల వర్గ పోరు బయటపడింది. హుజురాబాద్ ఫలితంపై  పోస్టుమార్టం నిర్వహించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ పిసిసి నేతలను ఢిల్లీకి పంపించింది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పార్టీ ముఖ్య నేతలంతా హస్తిన వెళ్లారు.

 ఈ సందర్భంగా ఏఐసీసీ వార్ రూమ్ లో జరిగిన భేటీ రచ్చరచ్చగా మారిందని తెలుస్తుంది.. రాహుల్ గాంధీ సన్నిహితుడు కేసి వేణుగోపాల్ సమక్షంలో జరిగిన సమావేశంలో వాడివేడిగా చర్చ సాగింది. దీంతో బై పోల్ ప్రకంపనలు కాంగ్రెస్లో ఇంకా చల్లారడం లేదు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 3 వేల ఓట్లు మాత్రమే రావడం ఆ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ కు కొందరు కాంగ్రెస్ నేతలు పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లుగా ఆరోపణలు రావడంతో టిపిసిసి చీఫ్ ను టార్గెట్ చేసేలా కొందరు ప్రయత్నాలు చేయడం తెలిసిందే. ఇలాంటి వేళ ఈ ఓటమిపై సమీక్షను ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్ లో పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నిర్వహించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: