పెళ్లి జీవితాలను మారుస్తుంది
అవును వివాహ బంధం ఇరు జీవితాలనే
కాదు ఆ ఊరినే మార్చింది
ఆ ఊరికో గొప్ప కళను తెచ్చింది
ఆ కథ స్ఫూర్తికి సంకేతం
ఆ కథ కనువిప్పు మన నాయకులకు!
తెలుసుకుందాం రా రండి!




ఊళ్లో పెళ్లి.. అంతా రావాలి.. అంతా వచ్చాక ఆశీర్వదించి వెళ్లాలి. వెళ్లాక పెళ్లి ముచ్చట ఆ నోట ఈ నోట వినిపించాలి. వినిపించాక ఆ రోజు నుంచి ఆ పెళ్లి మరొకరి జీవితాన్ని ప్రభావితం చేయాలి. వేడుక కు ఉన్న లక్ష్యం సామూహిక ఆనందం. సామూహిక ఐక్యత కూ డా! సామాజిక స్పృహ అన్నది చాలా తక్కువ. ఇదెందుకు ఉండదు? ఎందుకు ఉండకూడదు. ఈ ఒక్క ఆలోచనే ఆ ఊరికి రోడ్డు తె చ్చింది. ఆ ఇంటి పేరు జిల్లాలోనే కాదు ఏపీ సీఎంఓలోనూ మార్మోగిపోయింది. ఇంకేముంది ఇప్పుడిక జగనన్న ఆలోచనలో పడ్డా డు. లేదా పడేలా చేశాడు మనోడు. ఆ వార్త ప్రభావం అని అనలేం కానీ జగనన్న మాత్రం రోడ్ల మరమ్మతులకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్న ల్ ఇచ్చాడు. తొలి విడతగా ఎనిమిది వేల 268 కిలోమీటర్ల మేర రోడ్డు మరమ్మతు పనులకు అధికారులు టెండర్లు పిలవనున్నారు. జగనన్న ఆలోచన అనుకోండి లేదా ప్రతిపాదన అనుకోండి ఈ విడతలో నలభై ఆరు వేల కిలోమీటర్ల పరిధిలో రోడ్లకు మోక్షం దక్కించాలని, నాడు నేడు మాదిరిగా ఫొటోలు తీసి ఉంచాలని కూడా సీఎం ఆదేశించారు.



ఇక ఒక్కసారి నరసాపురం వెళ్లొద్దాం రండి. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురంలో రోడ్డు అధ్వానంగా ఉండడం చూసి కోపం తన్నుకువచ్చి స్థానికులు మరియు పెళ్లి కొడుకు తరఫు మనుషులు ఎన్నో సార్లు అర్జీలు ఇచ్చారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డును బాగుచేసే నాథుడే లేకపోవడంతో చేసేది లేక పెళ్లి కొడుకే రోడ్డు వేయించేందుకు పూనిక వహించాడు. అతడిదే కాదు వాళ్ల నాన్న కోరిక కూడా ఇదే! దీంతో పెళ్లికి వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తమ తమ ఇళ్లకు క్షేమంగా తిరిగి చేరుకోవాలని, ఎటువంటి  ప్రమాదాలకు తావిచ్చేలా తన ఇంటికి చేరుకునే దారి ఉండకూడదని భావించి, సంకల్పించి నరసాపురం మెయిన్ రోడ్డు నుంచి కొత్త నరసాపురం వరకూ తారు రోడ్డు వేశారు. లక్షలు వెచ్చించి సొంత ఖర్చుతో రోడ్డు వేయించి అధికారులను  సైతం ఆశ్చర్యపరిచారు ఆ పెళ్లికొడుకు మరియు ఆయన తండ్రి కూడా!  ఈ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. పోనీ ఇకపైన అయినా రోడ్ల మరమ్మతులకు అదేవిధంగా శిథిలావస్థకు చేరుకున్న రోడ్ల స్థానంలో కొత్త రహదారుల నిర్మాణానికి వైసీపీ సర్కారు తగినన్ని జాగ్రత్తలు మరియు చర్యలు తీసుకుంటే మేలు.


మరింత సమాచారం తెలుసుకోండి: