తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ మొత్తం జ‌గ‌న్ నిర్ణ‌యంపైనే ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. రానున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి టికెట్ రేటు పెంచే విష‌య‌మై ఇప్ప‌టికే నిర్మాతలు ఆన్లైన్ మాధ్య‌మాల ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనిపై తాము కోర్టుకు వెళ్ల‌మ‌ని, సామర‌స్య పూర్వ‌కంగానే తేల్చుకుంటామ‌ని చెప్పారు నిర్మాత డీవీవీ దాన‌య్య. అయితే వాస్త‌విక ప‌రిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రిపబ్లిక్ సినిమా ఫంక్ష‌న్ లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగా ఏపీ స‌ర్కారు మరింత సీరియ‌స్ గానే ఉంది. ఒక‌రు నీరు ఒక‌రు నిప్పు అన్న చందంగానే ఉంది. ప‌వ‌న్ నిప్పు.. జ‌గ‌న్ నీరు.. ఇక్క‌డ రౌద్రం ర‌ణం రుధిరం అన్న‌దే కొన‌సాగ‌నుంది. ఇప్పుడు నివురు గ‌ప్పిన నిప్పును పోలి ప‌వ‌న్ ఉన్నాడు. ఉద్ధృత‌మ‌యిన ప్ర‌వాహంను పోలి జ‌గ‌న్ ఉన్నాడు. దీంతో ఎప్పుడు ఏ వివాదం ముంచుకొస్తుందోన‌ని మెగాస్టార్ కూడా టెన్ష‌న్ పడుతున్నాడు.  

ఇక వివాదం విష‌యానికే వ‌స్తే..
మొద‌ట్నుంచి ఏపీ ప్ర‌భుత్వానికి క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి మ‌ధ్య చాలా దూరం ఉంటూ వ‌స్తోంది. పేరుకే మంత్రులు కానీ వాళ్ల‌కు కూడా జ‌గ‌న్ పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు. ఎప్ప‌టిలానే అధికారం అంతా తన ద‌గ్గ‌రే ఉంచుకుని జ‌గ‌న్ రాజ‌కీయం న‌డుపుతున్నార‌ని ఎప్ప‌టి నుంచో విమ‌ర్శ ఉంది. ఈ నేప‌థ్యంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి మంత్రి కొడాలి నాని మ‌ధ్య వ‌ర్తిత్వం న‌డుపుతార‌న్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. అయితే ఆయ‌న మాట వింటారా విన‌రా అన్న‌దే ఇప్పుడొక చిక్కుముడి. ఎందుకంటే నాని మొదట్నుంచి అటు తార‌క్ కు ఇప్పుడు ఇటు జ‌గ‌న్ కు స‌న్నిహితుడు. అంతేకాదు తార‌క్ నటించిన సాంబ, అదుర్స్ సినిమాల‌కు ప్రొడ్యూస‌ర్ కూడా! ఈ త‌రుణంలో తార‌క్ త‌ర‌ఫున నానీ మాట్లాడితే స‌మ‌స్య సాల్వ్ అవుతుంద‌ని ఇండ‌స్ట్రీ పెద్ద‌లు భావించి,  సంబంధిత లాబీయింగ్ కూడా చేశారు.


ప‌వ‌న్ పై ఉన్న కోపం కార‌ణంగా తార‌క్ సినిమాకు జ‌గ‌న్ అంగీకారం తెలిపే ఛాన్స్ లేనే లేదు. అలా కాకుండా జ‌గ‌న్ స‌మ్మ‌తిస్తే గొడ‌వే లేదు. ఈ నేప‌థ్యంలో నానీ మాట నెగ్గ‌క‌పోతే ఆయ‌న త‌న మంత్రి ప‌ద‌వి వ‌దులుకుంటారా? లేదా త‌న వ‌ల్ల కాలేద‌ని తార‌క్ కు సారీ చెప్పి సైడ్ అయిపోతారా? వీర విధేయుడిగా ఉన్న నానీ ఇక‌పై కూడా అలానే ఉంటారా లేదా తిరుగుబాటు చేసి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోతారా? ఎలానూ ఎప్ప‌టి నుంచో విజ‌య‌వాడ చౌద‌రిల‌కు సొంత పార్టీ పెట్టే ఆలోచ‌న అయితే ఉంది. కానీ బాబు కార‌ణంగానే వీళ్లంతా ఆగిపోతున్నారు. కేశినేని నాని, కొడాలి నాని లాంటి అసంతృప్తుల‌కు వేరే గూడు అవ‌స‌రం ఎంతైనా ఉంది. కానీ వీళ్లు ఇప్ప‌టికిప్పుడు త‌మ త‌మ పార్టీల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ఛాన్స్ అయితే లేదు అన్న‌ది సుస్ప‌ష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: