తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ కొంతమందిని లైట్ తీసుకుంటే మాత్రం కచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా కొంతమంది నాయకుల విషయంలో సీఎం కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కొంతవరకు వ్యక్తమవుతోంది. అందులో ప్రధానంగా చెప్పుకుంటే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే ఎలిమినేటి మాధవ రెడ్డి సతీమణి ఉమా మాధవ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో ఆదరణకు దూరంగా ఉన్నారు. వీళ్లకు సీఎం కేసీఆర్ పదవులు ఇస్తారు అని వారి వర్గాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి.

2018 ఎన్నికలకు ముందు తుమ్మల నాగేశ్వరరావు నీ క్యాబినెట్లోకి తీసుకున్న ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఆయనను దూరం పెట్టారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది కానీ ఇతర నేతలకు ఇస్తున్న ప్రాధాన్యత ఆయనకు ఇచ్చే అవకాశం ఏ విధంగా కూడా కనపడటం లేదు. తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీట్లకు సీఎం కేసీఆర్ ఆరుగురు నేతలను ఎంపిక చేశారు. కనీసం తుమ్మల నాగేశ్వరరావు పేరు పరిశీలనలో కూడా లేకపోవడం ఆయన వర్గాన్ని బాగా ఇబ్బంది పెడుతున్న అంశం.

వచ్చే ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా పెద్దగా కనబడటం లేదు. అక్కడి నుంచి మళ్లీ కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ లోకి వచ్చిన కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ వెళ్లి కలిసిన మండవ వెంకటేశ్వరరావు కూడా ఆదరణకు నోచుకోలేదు. స్వయంగా సీఎం కేసీఆర్ వెళ్లి కలిసిన సరే ఆయనకు టిఆర్ఎస్ పార్టీలో పదవులు దక్కక పోవడం పట్ల నిజామాబాద్ జిల్లాలో ఆయన వర్గం కాస్త సీరియస్గా ఉంది అనే ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: