ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు సంబంధించి వైసీపీ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది అనే ప్రచారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం గా మారుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అలాగే జడ్పిటిసి ఎంపిటిసి మిగిలిపోయిన స్థానాలకు సంబంధించి జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏపీలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొంతమంది సమర్థవంతంగా వ్యవహరించని మంత్రులను ముఖ్యమంత్రి జగన్ పక్కన పెట్టే అవకాశం ఉండవచ్చు అనే చర్చలు కూడా ఉన్నాయి.

కీలక నాయకులకు 2019 లో జగన్ కేబినెట్ లో స్థానం కల్పించలేదు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్లకు ఖచ్చితంగా కేబినెట్లో స్థానం కల్పించే విధంగా జగన్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. చిత్తూరు జిల్లాకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కచ్చితంగా క్యాబినెట్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారితో పాటుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి సీనియర్ నేత ఆనం రాంనారాయణరెడ్డికి ఆర్థిక శాఖ అప్పగించే అవకాశం కూడా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆనం రామనారాయణరెడ్డి ఆర్థిక శాఖను సమర్ధవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ఆయనను మరోసారి ఆ పదవిలో కూర్చోబెట్టాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుంది అనే భావనలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు అనేది ఇప్పుడున్న అభిప్రాయం. అయితే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో ఆనం రాంనారాయణరెడ్డి ఉన్న విభేదాల కారణంగా కేబినెట్ లోకి రావడం కాస్త కష్టమైనా సరే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆ విభేదాలను పరిష్కరించే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి స్పీకర్ తమ్మినేని సీతారాం పేరును కూడా ముఖ్యమంత్రి జగన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే యువ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేరు కూడా వైసీపీ అధిష్టానం పరిశీలనలో ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: