తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికీ అవకాశం కల్పిస్తారు ఏంటనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ కొంతమందిని ఎంపిక చేయక పోతే అనవసరంగా టిఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే మోత్కుపల్లి నరసింహులు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి వంటి వారిని సీఎం కేసీఆర్ ఎంపిక చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంది.

అదేవిధంగా సిద్దిపేట జిల్లా కు చెందిన కొంతమంది కీలక నాయకుల పేర్లను సీఎం కేసీఆర్ పరిశీలించకపోతే  విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానితో పాటుగా నల్గొండ జిల్లాకు సంబంధించి మాధవ రెడ్డి కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కూడా కొంత వరకు ఉంది. వారితో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును కూడా సీఎం కేసీఆర్ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కొంతమంది అంటున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లను సీఎం కేసీఆర్ పరిశీలించాల్సిన అవసరం ఉందని అలాగే మెదక్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కొంత మంది పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకోకపోతే మాత్రం ఆయా జిల్లాల్లో పార్టీ క్షేత్రస్థాయిలో నాయకత్వ సమస్యతో ఇబ్బంది పడే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. ఇక బండ ప్రకాష్ రాజ్యసభకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరిని రాజ్యసభకు పంపిస్తాం అనేదానిపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే ఎంపీ గా పనిచేసిన కవిత ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. మరి సీఎం కేసీఆర్ భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఎవరిని శాసనమండలికి పంపిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తి గల చర్చ.

మరింత సమాచారం తెలుసుకోండి: