కుప్పం మునిసిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే ఉంది. అయితే వైసీపీ వ్యూహాలకు చంద్రబాబు నిలవలేకపోయారు. చంద్రబాబు, లోకేష్ కలిసి నియోజకవర్గంలో ప్రచారం చేసినా ఓటమి తప్పలేదు. దీంతో ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు టీడీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో పుంగనూరుకు వచ్చి తనపై పోటీచేయలని కోరారు. కుప్పంలో ఎలాగూ టీడీపీ లేదని..అందుకే తానిచ్చిన సవాల్ ను స్వీకరించాలని చెప్పారు. చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయినా.. గెలిచినా, తనకు ఇష్టమేనని చెప్పుకొచ్చారు పెద్దిరెడ్డి.

చంద్రబాబుకు సవాల్ విసిరిన పెద్దిరెడ్డి మరికొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. టీడీపీని కుప్పంలో లేకుండా చేసిన చంద్రబాబుకు పార్టీ అధినేతగా కొనసాగే అర్హత లేదన్నారు. వెంటనే పార్టీని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల నుంచి చంద్రబాబు పూర్తిగా తప్పుకోవాలని అన్నారు. కుప్పంలో వైసీపీ నేతలు డబ్బులు పంచారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. సీఎం జగన్ ఇన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే, ఇక డబ్బులు పంచాల్సిన అవసరం తమకు ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో తమ పార్టీపై ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడారని.. ఇకపై అలా మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించారు.

అయితే పెద్దిరెడ్డి ఇచ్చిన ఈ ఆఫర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు స్వీకరిస్తారా..? లేక ఈ ఆఫర్ ను మామూలుగానే చూస్తారా.. అనేది కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. ఒకవేళ పుంగనూరులో చంద్రబాబు పోటీచేస్తే పరిస్థితి ఏమిటన్నది కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. వైసీపీ నేతలు చేస్తున్న ఈ విమర్శలకు టీడీపీ అధినేత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అయినా చంద్రబాబు, కుప్పం నియోజకవర్గం తనకు కంచు కోట వంటిదని ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి కోటలో ఇప్పుడు వైసీపీ పాగా వేస్తే చంద్రబాబు ఊరుకుంటారా..? ఒకే ఒక్క ఓటమితో నియోజకవర్గం మార్చుకుంటారా అనేది కూడా అనుమానమే.. ఎందుకంటే తనబలం మొత్తం కుప్పం నియోజకవర్గమే.. అందుకే వచ్చే ఎన్నికలలో బాబు కుప్పంలో గెలిచి, తన పంతం నెగ్గించుకునే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: