ఆట మొదలైంది మొదటి ఏడేళ్లు ఒకెత్తు, ఇకపై ఇంకో ఎత్తు. మాటల్ని మూటగట్టి పక్కనపడేసి, చేతల్లో చూపెట్టాలి అన్నట్లుగా తెలంగాణ రాజకీయాలు కనిపిస్తున్నాయి. కళ్లెం లేని గుర్రంలా బిజెపి పరిగెడుతోంది. ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ నొక్కి వదిలేసినట్టు హుజురాబాద్ విజయం తర్వాత కమలం పార్టీలో జోరు మరింత పెరిగింది. వరి ధాన్యం కొనుగోలు  వ్యవహారంలో మొదలైన టిఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ధం ఆ తర్వాత రకరకాల మలుపులు తిరిగింది. ఇప్పుడు ఏకంగా దాడుల వరకు వెళ్ళిందీ వ్యవహారం. టీఆర్ఎస్ బీజేపీ మధ్య రాజకీయం ఎందుకు భగ్గుమంది..? దాడుల సంస్కృతి తెలంగాణలోకి అడ్రెస్ వెతుక్కుంటూ వచ్చిందా..? దేశంలో పలుచోట్ల అనుసరించిన విషయాలనే ఇక్కడ కూడా  ఫాలో అవుతుందా..?

దాడుల మాటున దాగున్న రాజకీయం ఏంటి..? టిఆర్ఎస్ వర్సెస్ బిజెపి పోరు సరే కాంగ్రెస్ సంగతేంటి..? కాంగ్రెస్ ఇప్పుడు వీక్ గా కనిపించిన నల్గొండ జిల్లాలో హస్తం పార్టీ బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఆ పార్టీలో పెద్ద తలకాయలని పేరున్న నాయకుల్లోదాదాపు అందరూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినవారే. హస్తాన్ని  దాటేసి కారు ఇప్పుడు బలంగా కనిపిస్తుండగా  బిజెపి కనీసం ఎంపిటిసి గెలిచే బలం కూడా లేదు. ఏ మాత్రం బలం లేని ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ ని పైకి లేపుదామనుకున్నారో ఏమో కానీ దాన్యం కొనుగోలు అంశం పై పోరాటం చేస్తున్న బండి సంజయ్ జిల్లా పర్యటనకు వెళ్లారు. రైతులతో బండి సంజయ్ మాట్లాడు తుండగా టిఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.

 బండి సంజయ్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా పరిస్థితి మారింది. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. పోలీసుల సహకారంతోనే టీఆర్ఎస్ ఇలా చేసిందని బిజెపి, కమలం పార్టీ దొంగ నాటకాలు ఆడుతోందని కారు పార్టీ ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. ఇది ఒక రోజు తో ఆగిందా అంటే బండి సంజయ్ రెండోరోజు పర్యటనలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. హుజరాబాద్ లో మొదలై వరి దగ్గర టర్న్ తీసుకొని వయా పెట్రోల్ మీదుగా టిఆర్ఎస్,బిజెపి యుద్ధం కొనసాగుతోంది. ఈ వార్ ఇప్పట్లో శాంతించే పరిస్థితి కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: