ఇటీవలికాలంలో పెంపుడు జంతువులను పెంచుకోవడం ఒక ట్రెండ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సంపన్నులు వరకూ అందరూ కూడా ఇలా జంతువులను పెంచుకుంటున్నారు. ఇక కొంతమంది అయితే ఏకంగా మనుషుల కంటే ఎక్కువగా పెంపుడు జంతువులపైనే ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో పెంపుడు జంతువులకి వాటి యజమానులకు మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. అయితే ఇలా పెంపుడు జంతువులను పెంచుకోవడం మాత్రం ఎంతో మంచిది అని కొన్ని కొన్ని ఘటనలు చూస్తే అర్థమవుతుంది. యజమాని ప్రమాదంలో ఉన్న సమయంలో ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించే పెంపుడు జంతువులు యజమానిని రక్షించడం లాంటి వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.



 ఇలా ఇటీవలి కాలంలో మనుషులు పెంచుకుంటున్న పిల్లులు, కుక్కలు లాంటివి జంతువులు యజమానుల విషయంలో ఎంతో విశ్వాసంతో ఉంటూ ప్రమాదం వచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి రక్షించడం లాంటివి కూడా చేస్తున్నాయి. ఇక్కడ ఓ పిల్లి ఇలాంటిదే చేసింది. ఒక ముక్కు పచ్చలారని శిశువు నాలాలో పడి ఉండగా ఏకంగా సాహసం చేసి పిల్లి ఆ శిశువును రక్షించింది. అయితే ఆ శిశువును ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే నాలలో పడివేయడం గమనార్హం. నేటి రోజుల్లో మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషుల్లో ఆ మానవత్వమే రోజురోజుకు మసకబారి  మారిపోతుంది. రోజురోజుకీ వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అసలు మనుషుల్లో మానవత్వం అనేది బ్రతికి ఉందా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో పెరిగిపోతుంది. ముఖ్యంగా చిన్నారుల విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు.



 ముంబై శివారులోని ఘట్కేపర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి వస్త్రాల్లో చుట్టిన ఒక శిశువును ఘట్కేపర్ లో ఉన్న రామాబాయి నగర్ నాలా లో పడేశాడు. ఆ సమయంలో అక్కడే తిరుగుతుంది ఓ పిల్ల. ఇక ఆ వ్యక్తిని గమనించింది. ఈ క్రమంలోనే నాలాలో పడవేసిన శిశువు దగ్గరికి వెళ్లి బిగ్గరగా అరవడం మొదలు పెట్టింది.. ఇక ఇది గమనించిన చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. అంతలో వస్త్రాల్లో ఉన్న శిశువు ఏడవటం మొదలుపెట్టింది.. దీంతో స్థానికులు ఆ శిశువును రక్షించి స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆసుపత్రిలో చేర్పించినా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cat