ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పటికే తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన సాగిస్తూ ఉండడంతో ప్రజలందరూ దీన స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఒక్కసారిగా ఆప్ఘనిస్థాన్లో జనజీవనంకాస్త తలకిందులుగా మారిపోయింది. ఆఫ్గనిస్థాన్లో తాలిబన్లు ఆధిపత్యాన్ని చేపట్టిన తర్వాత షేరియా చట్టాలను అమలు లోకి తీసుకు వచ్చారు. ఇక ఈ చట్టాల ప్రకారమే పాలన సాగిస్తూ దారుణంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. ఒకవైపు ప్రజలను బానిసలుగా.. ఆడవాళ్ళను ఆటబొమ్మలు గా చూస్తూ దారుణం గా వ్యవహరిస్తున్నారు.. ఇలాంటి సమయంలో ఇప్పటికే తాలిబన్ల అరాచక పాలన తో జీవితంపై విరక్తి చెందిన ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు.. ఇక ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల వరుసగా బాంబు పేలుళ్లకు పాల్పడుతుండడంతో ప్రాణాలపై ఆశలు కూడా వదులుకున్నారు.


 ఎప్పుడు ఏ క్షణంలో ఎక్కడ బాంబు పేలుళ్లు జరుగుతాయో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది.. దీంతో చాలా మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని సాగిస్తున్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లకు సవాల్ విసురుతూ వరుసగా బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నారు ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల. తీవ్రవాదుల చర్యలను అడ్డుకుంటామంటూ తాలిబన్లు చెబుతున్నప్పటికీ  బాంబు పేలుళ్లు మాత్రం ఆగటం లేదు. వారంలో దాదాపు రెండు మూడు సార్లు బాంబు పేలుళ్లు జరుగుతూ ఉండటం గమనార్హం.


 ఇలా వరుసగా ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ బాంబు పేలుళ్లతో వణికిపోతుంది. ఇక ఇటీవలే ఒక్కరోజే రెండు బాంబు పేలుళ్లు జరగడం సంచలనంగా మారిపోయింది. కారు లో బాంబు పేలిన ఘటనలు ఏకంగా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఇక ఉదయం సమయం లో జరిగిన బాంబు పేలుడులో మొత్తంగా నలుగురు మృతి చెందడం గమనార్హం. ఇస్లామిక్ స్టేట్ కి చెందిన ఉగ్రవాదులు ఎక్కువగా ఈ బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకే రోజు రెండు బాంబు పేలుళ్లు జరగడం మాత్రం సంచలనంగా మారిపోయింది. వరుస బాంబు పేలుళ్లు తాలిబాన్లకు సవాలుగా మారిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: