తెలుగు దేశం పార్టీ(టీడీపీ) అధినాయకత్వం ఆలోచనలు బెడిసికొడుతున్నాయా లేక అక్కడ లోపాలు ఉండటం వలన ఆ పార్టీ పూర్తిగా నష్టపోవాల్సి వచ్చిందా.. అనే ఆలోచనలలో పడాల్సిన సందర్భం ఇది. అసలు అలాంటి ఆలోచన గత ఎన్నికలలో ఓడినప్పుడే చేసి ఉంటె ఇప్పటికే పార్టీ కాస్త మెరుగుపడేది. కానీ లేనిపోని తలాకుమాసిన ఆలోచనలు అవి ఎవరు ఇచ్చారో కానీ వాళ్ళ వలన నేడు పార్టీ పూర్తిగా కనుమరుగు అయ్యే పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఎవరో ఇచ్చినా దానిని అమలు చేయాల్సింది చివరికి అధిష్టానం కాబట్టి అక్కడ ఉన్నవారి బుద్ధికి ఏమైంది. పోనీ ఆలోచనలు  కూడా వారివే అనుకుంటే ఇక చెప్పేదేమీ లేదు, వాళ్ళ బుద్ధికి ఏదో అయ్యిందని స్పష్టతకు వచ్చేయొచ్చు.

గతంలో కూడా టీడీపీ ఇంతకన్నా మెరుగ్గా ఉన్నదెప్పుడు లేదు. అలనాడు పార్టీ పెట్టిన కొత్తలో అప్పటి అధినేత చేతులలో ఉన్నంతవరకే దానికో గొప్ప వ్యక్తిత్వం ఉండేది, దానిని తరువాత నాయకత్వం ఎంతగా దిగజారుస్తూ వచ్చిందో ఇప్పటివరకు అందరు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మాత్రం అది కూడా గత ఎన్నికల అనంతరం నుండి పూర్తిగా దిగజారిపోయినట్టే ప్రవర్తించింది ఆ పార్టీ నాయకత్వం సహా అందరు. ఎవరో కొందరు అనంతర పరిణామాలతో పక్కకు ఉంటున్న వాళ్ళు నయం అనిపించుకున్నారు. నిజమే పార్టీ అయినంత మాత్రాన తప్పుడు ప్రచారాలు చేస్తుంటే, వాటికి తందానా అనకుండా పక్కకు వెళ్లిపోవడం కొంతవరకు సరైన నిర్ణయమే. కానీ తందానా అన్నవాళ్ళు మాత్రం ఇప్పట్లో తేరుకోలేరు అనేది వాస్తవం.

ఇలా పార్టీ పరిస్థితిని స్వయంగా అధిష్టానం ఎప్పటి నుండో దిగజారుస్తూనే ఉంది. తాజాగా పూర్తిగా దిబ్బలో పడినంత పని చేసేసింది. కేవలం ఇదంతా నాయకత్వం వలన వచ్చిన తిప్పలో లేక వారు తీసుకున్న నిర్ణయాలు తప్పో ఇప్పటికైనా ఆ పార్టీ వర్గాలు కూలంకషంగా చర్చించుకొని మంచి నిర్ణయానికి వస్తేనే భవిష్యత్తులో పార్టీ కాస్త నిలదొక్కుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికి కొన్ని చోట్ల ఫలితాలు ఉన్నాయంటే అదంతా పార్టీని చూసి, గత నాయకత్వాన్ని చూసి తప్ప మరొకటి కాదని గుర్తుపెట్టుకోవాలి. ఆ నాయకత్వాన్ని ఫోటోగా పెట్టుకొని ఇంకా తిరిగినంత మాత్రాన ఈసారి ఓట్లు రాబట్టడం కుదరని పని.

మరింత సమాచారం తెలుసుకోండి: