ఎప్పుడో కరోనా ప్రారంభం కాలంలో అమెరికాలో కూడా షాపులలో పడి జనం సరుకులు పెద్దమొత్తంలో తీసుకుల్లడం చూశాం. అప్పట్లో ఉన్నవాళ్లు డబ్బులు ఇచ్చారు, లేని వాళ్ళు పట్టుకెళ్లిపోవడం పైనే దృష్టి పెట్టారు. అందుకే ఒక్కసారిగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా ఖాళీ అయిపోయాయి. అప్పటి ఆ పరిస్థితి కాస్త బయంకరంగానే ఉందని చెప్పాలి. ఇప్పుడిప్పుడే కాస్త కరోనా నుండి అమెరికా కోలుకుంటుంది అని చెప్పాలి. సొంత వాక్సిన్ సహా పలు విషయాలు అందుబాటులోకి తెచ్చుకుని అమెరికా దాని తిప్పలు అది పడుతూనే ఉంది. ఎంతో గొప్ప దేశంగా ఉన్న అమెరికా కరోనా తో కుదేలైపోయింది. దానికి కూడా బోలెడు అప్పులే మిగిలాయంటే అక్కడ పరిస్థితి ఊహించవచ్చు.

ఒకపక్క ఆఫ్ఘన్ నుండి వైదొలగడం, ఇంకోపక్క కరోనా తో తీవ్రంగా బాధించ బడ్డ ఏకైక దేశంగా అమెరికా అవమానాలు అనుభవించాల్సి వచ్చింది. అయినా కాస్త నిలదొక్కుకునే వరకు ఈసారి ప్రశాంతంగానే ఉండటం మొదటిసారి గమనించదగ్గ విషయం. కరోనా కు కారణం చైనా అని, దానిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని తీవ్రంగా అమెరికాకు ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు సహకరించక మిన్నకుండిపోతుంది. అప్పటికి వీలైనప్పుడల్లా చైనా పై ఏదో ఒక రూపంలో ఆంక్షలు పెడుతూనే ఉంది. నిజానికి కరోనా వలన చైనా ఎప్పుడో ప్రపంచానికి దూరంగా జరిగిపోయిందనే చెప్పాలి. ఇది అమెరికాకు స్వాగతించదగ్గ పరిణామం అయినప్పటికీ ఆవేశంతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో మాత్రం ప్రస్తుతం అమెరికా లేదు. అందుకే నిదానంగా ఉండక తప్పడం లేదు.

ప్రస్తుతం అమెరికాలో మరో సంక్షోభం అది కూడా కరోనా ప్రారంభంలో లాంటిదే సంబవించేట్టుగా ఉంది. ఎప్పుడు దేశంలో సరుకులు నిండుకుంటాయో తెలియని స్థితిలో ప్రస్తుతం కూడా జనాలు షాపింగ్ భారీగా చేసుకుంటూ, వాళ్లకు వీలైనంత దాచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపుగా ఇది అమెరికన్లకు ఉన్న అలవాటే, వాళ్ళు ఎప్పుడు సెలవులకు వెళ్లాలన్న ఇలాంటి భారీ షాపింగ్ చేసి, సరుకులు నిల్వ ఉంచుకుంటారు. అదే తరహాలో ఈ క్వార్టర్ లో అమ్మకాలు జరిగినట్టు ప్రాంతీయ మీడియా స్పష్టం చేసింది. అంటే యూరప్ దేశాలలో కరోనా విజృంభిస్తున్నందున, మళ్ళీ అమెరికాలో లాక్ డౌన్ వచ్చే సూచనలు ఉంటాయనే ముందస్తు జాగర్త కూడా ఈ భారీ కొనుగోళ్ళకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: