తాజాగా టీడీపీ అధినేతగా మళ్ళీ చంద్రబాబు ఎన్నుకోబడిన విషయం తెలిసిందే. అయితే అది చాలా మందికి ఇష్టం లేకపోయినప్పటికీ జరిగిపోయింది అనేది ఆ పార్టీ అంతర్గత చర్చ. అందుకే తాజాగా ప్రాంతీయ ఎన్నికలలో స్వయంగా బాబోరు రంగంలోకి దిగినప్పటికీ ఆయనకు మద్దతు ప్రకటించలేదనేది వస్తున్న వార్తలు. ఈ దెబ్బతీయ అయినా ఆయన తన పట్టుదల వదులుకొని నాయకత్వం నుండి తప్పుకుంటారేమో అనేది ఆయన నేతలు వేసిన వ్యూహాత్మకమైన తిరుగుబాటుగా ఈ చర్యను పరిగణించాల్సి ఉంటుందా..! ఒక్కసారి ఆయన దిగిపోతే, లైన్ లో వారసుడు తప్ప మరొకరు ఉంటె ఆయన ఒప్పుకోడు. మరి సీనియర్ లు అంతమంది ఉండగా వారసుడిని పట్టాభిషిక్తుడిని చేస్తే ఫలితాలు మళ్ళీ ఇలానే ఉంటాయేమో అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి.

అలా చేయకుండా నాయకత్వం మార్పు అనగానే అందులో వారసుడిని కూర్చోబెడితే, సీనియర్ లు సహకరించకుండా పక్కన పెడితే ఆయన మాత్రం ఏమి చేయగలడు. అసలే ప్రజాక్షేత్రంలో మంచి పేరు ఉన్న నేత, కాబట్టి ఈ నాయకత్వం కూడా ఫలితాలు తెచ్చేదిగా మాత్రం కనిపించడం లేదు. అంటే ప్రస్తుతానికి తమలో ఎవరినో ఒకరిని (సీనియర్ లలో) పార్టీకి అధినేతగా ప్రకటిస్తే ఫలితాలు తేవడానికి కృషి చేసే పరిస్థితి ఉండొచ్చు అనే ప్రణాళిక వేసి ఉండొచ్చునా..? అదేదో సామెత చెప్పినట్టు, కుతంత్రాలకు పుట్టినిల్లు లాంటి బాబోరి ముందు సీనియర్ లు కుప్పిగంతులు వేయగలరా అనేది ప్రశ్న కూడా ఇక్కడ రావచ్చు. అది నిజమే, చూడాలి ఏమి జరుగుతుంది అనేది.

ప్రస్తుత పరిస్థితి చుస్తే మాత్రం నిశబ్దంగా టీడీపీ లో అధినాయకత్వ పదవిపై పోరాటాలు జారుతున్నట్టే ఉంది. ఈసారికి మార్పులు అయిపోయినా కూడా, దానికి ఫలితాలు తెలియాలి కాబట్టి, అవకాశం ఉన్నప్పటికీ కొందరు దూరంగానే ఉన్నారనేది ఆ పార్టీ వర్గాలలో వస్తున్న మాటలు. కేవలం పదవి ప్రధానంగా ఇస్తే, పని చేసే వాళ్ళు ఉన్నారా, అంత ఆర్థిక బలగం టీడీపీ లో ఏ నాయకత్వానికి ఉంది, లాంటి కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రాబోయే ఎన్నికలలో వాళ్ళు మొత్తం పార్టీకి ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తే, అందుకు సిద్దంగానే ఉండాలి. అలాంటి నేత టీడీపీ లో ప్రస్తుతం ఉంటె అప్పుడు నాయకత్వంలో మార్పులు ఆశించవచ్చు. అలాంటి సీనియర్ ఉన్నాడా అన్నదే సందేహం!

మరింత సమాచారం తెలుసుకోండి: