ప్రస్తుతం తెలంగాణాలో కేసీఆర్ ప్రజలను తన ఓటమి నుండి దృష్టి మళ్లించే పనిలో పడ్డాడు. అందుకే ఎన్నడూ లేని విధంగా మరోసారి ఉద్యమం అంటూ పూనుకుంటున్నాడు. ఈ దెబ్బతో మరోసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని లేవనెత్తడం ద్వారా ప్రాంతీయ తత్వాన్ని ప్రజలలో లేపి మరోసారి తనపువైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతున్న రాజకీయం తప్ప, ప్రజాశ్రేయస్సుకోసం మాత్రం కాదు. గతంలో కేంద్రం పెద్దనోట్లు రద్దు చేసినప్పుడు కూడా అందరు ముందు ఆందోలన పడ్డారు. అనంతరం దాని పరిణామాలు డిజిటల్ విధానంలో భారత్ ను మొదటి స్థానంలో నిలపడం ద్వారా తెలుసుకున్నాం.

అలాగే రైతు చట్టాలపై కూడా ప్రభుత్వానికి అదే దూరదృష్టి ఉండవచ్చు అనే కోణంలో ఎవరు ఆలోచడం లేదు. కనీసం అసలు ఆ ఫలితాలు ఉంటాయని తెలుసుకున్న విద్యావంతులు కూడా వాటిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నారు. అందుకు కారణం రైతులను అడ్డం పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వంపై బురద జల్లడం ద్వారా దానిని అధికారంలో నుండి దించేయవచ్చు అనే పనికిమాలిన వ్యూహాలతో విద్యావంతుల నోళ్లు కూడా మూపిస్తున్నట్టుగానే ఉన్నారు. ఒకటి ప్రారంబిస్తేనే కదా, దానివలన కలిగే ప్రయోజనాలు తెలిసి వస్తాయి. అసలు ప్రారంభించకుండా వద్దనుకుంటే, సంస్కరణలు ఎలా సాధ్యం అవుతాయనేది ఎవరు ఆలోచించడం లేదు. కనీసం దీనిపై మీడియా కూడా స్పష్టత ఇవ్వలేకపోతుందంటే, విపక్షాలు ఎంతగా ఆయా వ్యవస్థలపై ప్రభావం చూపిస్తున్నాయి అనేది అర్ధం అవుతుంది.

ఫలితాలు ఉంటాయనేది నిపుణులు విపులంగా చెప్పడం వలననే కేంద్రం కూడా అలాంటి చట్టాలపై ఇంత మొండిగా ముందుకే వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. రైతు పేరుచెప్పి నేతలు ఇంకా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారనే దానికి ప్రస్తుత రైతు ఉద్యమాలు ప్రధాన సాక్ష్యాలు. రాజధానిలో కూడా రైతులలో లేనిపోని అపోహలు కల్పించడం ద్వారా రైతు నేతలు విపక్షాల చేతిలో పావులుగా మారిపోయారని అర్ధం అవుతుంది. వీటన్నిటిని చూపి ప్రభుత్వం రైతులపై కక్షగట్టిందనే వార్తలు చూపించి, తమ లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఆయా పార్టీలు లేదా విపక్షాలు చూస్తున్నాయి. అందులో భాగంగానే కేసీఆర్ కూడా తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ధాన్యంపై ముందుగానే కేంద్రం ఒక మాట చెప్పడం జరిగినా, దానిని అడ్డుపెట్టుకొని తన స్వప్రయోజనాలకు లేనిపోని నిరసనలతో ప్రజలను దారి మళ్లిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: