ఏపీలో మినీ లోకల్ పోరుగా అంతా భావించిన ఎన్నికల్లో వైసీపీ రికార్డు స్థాయి విజయాలను నమోదు చేసింది. అదే సమయంలో విపక్షాలు బాగా డీలా పడ్డాయి. ఇక ఏపీలో తమకు ఎదురులేదని వైసీపీ అనుకుంటున్న నేపధ్యంలో అధికార పార్టీ డిఫెన్స్ లో పడే సీన్లు కూడా అక్కడక్కడ కనిపించాయి.

ఇంతటి భారీ విజయంలో కూడా వైసీపీకి  బాధ కలిగించే విధంగా ప్రకాశం జిల్లాలోని దర్శి మునిసిపాలిటీలో టీడీపీ అధ్బుతమైన విజయం సాధించింది. ఇక క్రిష్ణా జిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి వంటి చోట్ల కూడా టీడీపీ బాగా పుంజుకుంది. అంతే కాదు వైసీపీతో సరిసమానమైన సీట్లు సాధించింది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో కూడ ఐదే సీన్ ఉంది.

పరిషత్ ఎన్నికల్లో చూసుకుంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని తాడికొండలోని రెండు ఎంపీటీసీ సీట్లు టీడీపీ ఖాతాలో పడ్డాయి. మరి దీని అర్ధమేమిటి తిరుమలేశా  అంటే అమరావతి ఉద్యమ‌ ప్రభావం మూడు జిల్లాల మీద గట్టిగానే ఉందనే విశ్లేషణలు వినవస్తున్నాయి. గుంటూర్, క్రిష్ణ, ప్రకాశం జిల్లాలలో చూసుకుంటే కచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి కొంత ఇబ్బంది కలిగించేలాగానే సీన్ ఉంటుంది అంటున్నారు.

ఇప్పటికే అక్కడ అలాంటి సంకేతాలు ఉన్నాయి కాబట్టి అమరావతి రాజధాని విషయం ఇపుడు జనాల్లో చర్చకు వస్తోంది అన్న టాక్ ఉంది. మొత్తానికి చూస్తే వైసీపీ కనుక జాగ్రత్త పడకపోతే మాత్రం 2024 ఎన్నికల్లో అమరావతి ప్రభావం చాలా ఎక్కువగానే ఉండొచ్చు అన్నదైతే రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తోంది. మరి జాగ్రత్త పడాల్సింది జగనే. ఆయన ఏ రకమైన వ్యూహాన్ని రూపొందిస్తారో కూడా చూడాలి. ఇక అమరావతి రైతులు మహా పాదయాత్ర కూడా చేపట్టారు దానికి జనాల నుంచి మద్దతు కూడా లభిస్తోంది. ఈ నేపధ్యంలో అది ఏపీ అంతటా పాకితే ఆ ప్రభావం ఎలా ఉంటుందో కూడా చూడాలి. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో అమరావతి ప్రధాన సమస్యగా మారుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: