తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల విషయంలో గతంలో విపక్షాలు కూడా ఎక్కువగా చర్చించుకున్న పరిస్థితి ఉండేది అనే మాట వాస్తవం. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రసంగాల విషయంలో ఇప్పుడు పెద్దగా మీడియా కూడా ఫోకస్ పెట్టడం లేదని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది మాట్లాడినా సరే గతంలో పెద్దగా విపక్షాలు గట్టి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం కాస్త విపక్షాలు గట్టిగా కౌంటర్ ఇవ్వటమే కాకుండా సీఎం కేసీఆర్ తీరును ఎండగట్టే విధంగా ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రసంగాల విషయంలో సోషల్ మీడియాలో కూడా పెద్దగా చర్చ జరగడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ ప్రసంగం గురించి పెద్దగా మాట్లాడే వాళ్లు కూడా కనపడటం లేదు. ఇక మీడియా కూడా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వెనక అర్థాలను వెతికే ప్రయత్నం కూడా దాదాపుగా మానేసింది. దీంతో సీఎం కేసీఆర్ కు ఆదరణ తగ్గింది అభిప్రాయం కూడా కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది అనే మాట వాస్తవం. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ ఎంత వరకు సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు అనే దానిపై వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం సీఎం కేసీఆర్ కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా ఉంటే మంచిదనే అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తాజాగా స్పష్టం చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది లేకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఇబ్బంది పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: