ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈ మధ్యకాలంలో దారుణంగా మారింది అనే అభిప్రాయాలు చాలా వరకు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధిష్టానం కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్త గా వ్యవహరిస్తున్న సరే మరి కొన్ని అంశాల్లో మాత్రం ఇబ్బంది పడుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజలు ఇబ్బంది పడే సమస్యలను చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా సరే అది పెద్దగా ఫలించలేదు అనే భావన ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు ఎన్ని విధాలుగా సూచనలు సలహాలు ఇచ్చినా సరే ఎవరు కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు.

స్థానిక నాయకత్వంలో చంద్రబాబు నాయుడు విషయంలో నమ్మకం పోయిందని ప్రచారం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో చేసే ప్రసంగాలకు పెద్దగా తెలుగుదేశం పార్టీలో కూడా ఆదరణ లేదనే భావన ఉంది. టిడిపిలో కొంతమంది కీలక నాయకులు చంద్రబాబు ఆదేశాలను పట్టించుకోకపోవడం ప్రజల్లోకి వెళ్లే విధంగా మాట్లాడకపోవడం ఇబ్బందికరంగా మారిన అంశంగా  చెప్పాలి. టిడిపిలో అగ్రనేతలు గా చలామణి అయ్యే వారు చంద్రబాబు ప్రసంగాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్న అంశం.

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ ఈ మధ్యకాలంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేసినా సరే అధికార పార్టీ విజయావకాశాలు మీద తక్కువ అంచనా వేసుకుంది. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం పై చాలా సానుకూలత ఉంది అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తూ ముందుకు వెళ్లడం తెలుగుదేశం పార్టీని బాగా వెనక్కి లాగుతున్న అంశం. ఇక చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి రాజకీయంగా తక్కువ అంచనా వేసుకోవడం కూడా టిడిపిని మరింతగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: