తెలుగుదేశం పార్టీలో ఈ మధ్యకాలంలో వర్గ విభేదాలు పెరగటం చంద్రబాబు నాయుడు ని బాగా వెనక్కి లాగుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కృష్ణా జిల్లాలో ఉన్న కొంతమంది నాయకుల విషయంలో చంద్రబాబు నాయుడు వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా కీలక బాధ్యతలు అప్పగించడం పార్టీ నాయకత్వానికి ఏమాత్రం కూడా నచ్చడం లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో ఉన్న కొంతమంది కీలక నాయకుల విషయంలో ప్రజల్లో వ్యతిరేకత ఉండటమే కాకుండా పార్టీ కార్యకర్తలు కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అనే వార్తలు వినపడుతున్నాయి.

రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఒకప్పుడు కొంతమంది నాయకులు ఆదుకున్నారు అనే కారణంతో వాళ్లకు చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా ప్రాధాన్యత కల్పిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కొంతమంది విషయంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అనే మాట వాస్తవం. అదేవిధంగా రాజకీయంగా కొంతమందిని ముందుకు తీసుకు రావాల్సిన అవసరం ఉన్నా సరే చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం కూడా కొంతవరకు వ్యక్తమవుతోంది.

కృష్ణా జిల్లాల్లో చాలా మంది యువ నాయకులు పార్టీ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు వాళ్ళని ముందుకు తీసుకు రాకపోవడంతో వాళ్ళు అందరూ కూడా అధికార పార్టీ వైపు చూస్తున్నారని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మరి భవిష్యత్తులో అయినా సరే చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లాలో యువ నాయకత్వాన్ని గుర్తించి ముందుకు తీసుకు వస్తారా లేదా అనేది చూడాలి. ఇదే వైఖరి కొనసాగితే మాత్రం మరిన్ని ఇబ్బందులు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న కీలక నాయకత్వం కార్యకర్తలకు కూడా దూరంగానే ఉంటుందనే అభిప్రాయం కొంత వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: