2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీజేపీ కానీ మోడీ కానీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. కానీ ఒక్కోసారి కరోనా లాంటి విషయాలు కూడా తట్టుకోగలిగారు, అయితే రైతుల ఉద్యమానికి మాత్రం సరైన సమాధానం చెప్పలేకపోయారు. అంటే వారి ఉద్దేశ్యంలో రైతు ఉద్యమం విపక్షాలు నడిపిస్తున్న నాటకంగా మాత్రమే కనిపించి ఉండొచ్చుగాక. కానీ అలా అనుకోవడం వలన నష్టపోవాల్సి వచ్చింది మళ్ళీ ప్రభుత్వమే. ఇప్పటికి ఆ చట్టాలను చివరికి రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇది ప్రభుత్వానికి నష్టం అని చెప్పాల్సిన పని లేకపోయినా, ఒకవిధంగా రైతు మేలు కోసం చేసినప్పటికీ దానిని ఎంతవరకు వారి వరకు తీసుకెళ్లగలిగారు అనేది కూడా ఇక్కడ అంశం. ఆ అంశంపై పార్టీ పెద్దగా దృష్టి పెట్టలేకపోయింది.

రైతు చట్టాలు ఒకపక్క రైతుల ప్రయోజనం కోసమే అంటుంది ప్రభుత్వం. కానీ ఇంతలో వాటిపైలేనిపోని అపోహలు విపక్షాలు రైతులలో రేపి, వాళ్ళ అండలో ఉన్న రైతు నేతలను రెచ్చగొట్టి ఉద్యమానికి ఉసిగొలిపి ఉండవచ్చు అనుకుందాం. అలా విపక్షాలు చేసినప్పుడు, ఇంతకాలంగా రైతు ఉద్యమాన్ని నడపనీయకుండా నేరుగా ఆయా ప్రయోజనాలు ఎలా రైతులకు అందుతాయనేది భారీగా ప్రచారం చేసి ఉండవచ్చు. అలా చేయడం కూడా ఖర్చు, కరోనా నేపథ్యంలో అవన్నీ చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందనుకున్నప్పటికీ, కనీసం రైతు చట్టాలపై ఆయా మీడియా లలో రైతులతో ముఖాముఖీ ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఇలా ఏదో ఒకదారిలో రైతులకు ఈ చట్టాలలో ఉన్న విషయాన్ని చేరవేసి ఉంటె వాళ్లకు చేరాల్సిన ప్రయోజనాలు చేరేవి, అలాగే విపక్షాల దొంగ నాటకాలకు చెక్ పెట్టినట్టుగా ఉండేది.

కేవలం రైతు మేలు కోసం చేసిన చట్టాలు అమలుకు నోచుకోకుండా రద్దు కావడం ప్రజాస్వామ్యానికి చెడు చేస్తుంది. రాజకీయాల కోసం ఈ రద్దు జరిగింది అనే అపోహ ప్రచారంలోకి వస్తుంది. ఏది ఏమైనా రద్దు జరిగింది కాబట్టి బీజేపీ ఒడ్డున పడి ఉండొచ్చుగాక, కానీ రైతులకు జరగాల్సిన మేలు మాత్రం వెనకడుగు వేసింది. అదే మోడీ వెనకడుగు. ఇప్పటి దేశ పరిస్థితి ఒకపక్క చైనా లాంటి దేశాలతో సమస్య, మరోపక్క కరోనా సమస్య, అందువలన వచ్చిన సంక్షోభాలను సరిచేసే సమస్య, ఇంకోపక్క ఇదే అదునుగా దేశద్రోహాలకు పాల్పడుతున్న విపక్షాల నుండి దేశాన్ని కాపాడుకోవాల్సిన సందర్భాలు ఇలా వీటన్నిటి నేపథ్యంలో రైతు చట్టాలు రద్దు వలన ఒక సమస్య తీరుతుంది. వాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోతే ప్రధానంగా రైతులను అడ్డుపెట్టుకుంటున్న ఉగ్రభూతాలకు దాదాపు చెక్ పెట్టినట్టు అవుతుంది. మొత్తంగా దేశ రాజధానిలో ప్రశాంతత చేకూరే అవకాశం ఉంటుంది. ఇతర సమస్యలపై నేతలు దృష్టి పెట్టె అవకాశం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక అడుగు వెనక్కి వేసినా పరవాలేదు, అనుకుని వేసిన అడుగు అది. విలువైనదే, రైతుకు పరోక్షంగా ఇది కూడా మేలు చేసేదే. చట్టాలు ఇవాళ కాకపోతే రేపు ఆలోచించవచ్చు.  ప్రస్తుతం దేశమే ప్రాధాన్యం. అందుకే వెనకడుగు. ఇది ప్రజలు, రైతులు ఆలోచించాల్సిన విషయం. దేశం ఐక్యంగా ఉండాల్సిన సమయం.

మరింత సమాచారం తెలుసుకోండి: