పార్టీ ఆవిర్భావం నుండి జనసేన ఉత్సాహం అంతా ఇంతా కాదు, తమ అభిమాన నటుడు రాజకీయాలలోకి రావడం నుండి ప్రజాసేవ అర్ధం మారిపోతుందని ఆశించారు. అయితే మొదటి సారి ఎవరికోసమో పోటీలో లేకుండా వెనకడుగు వేసినప్పుడే వాళ్ళ ఉత్సాహం నీరుగారిపోయింది. అప్పటి నుండి వాళ్ళ ఉత్సాహంపై ఎప్పటికప్పుడు అధినేత స్వయంగా నీళ్లు జల్లుతున్నట్టు ప్రవర్తిస్తూనే ఉన్నాడు. ఒక్కనాడు పార్టీని కనీసం సేన పట్టించుకున్నంత మాత్రం కూడా లేని అధినేత ఎప్పుడు చుట్టం మాదిరి కనిపించి వెళ్లిపోవడమే పనిగా పెట్టుకున్నాడు. అలా వస్తాడు, అదికూడా ఎప్పుడు, ఎందుకు వస్తాడో కూడా తెలియదు. అదంతా ఊహాతీతంగా జరిగిపోతుంది, రావడం మైకు ముందు గొల్లుమనడం, మళ్ళీ కనపడకుండా పోవడం. ఇదంతా ఎప్పుడూ జనసేన విషయంలో చూస్తున్నదే.

మొదట ఉద్యమకారుల పార్టీలతో కలిశాడు, అనంతరం టీడీపీ, తరువాత బీజేపీ. ఇప్పుడు ఎవరితో ఉన్నది కూడా తెలియని స్థితి. ఇంతోటిదానికి మళ్ళీ తెరవెనుక ఒకరితో, ముందు ఒకరికి మద్దతు పలుకుతూ ఉన్న కాస్త ప్రజాదరణను పోగొట్టుకుంటూనే వస్తుంది జనసేన పార్టీ. ఆయన స్వభావం మంచిదనేసి, రాగానే ఓట్లేసి సీఎం పదవిలో కూర్చోబెట్టడానికి ముందు అతడు ఎవరెవరికి అభిమాని, వాళ్ళు ఎంతవరకు ఓటుగా మారతారు, ఎన్ని నియోజక వర్గాలలో తాను తిరిగాడు, ఎంత వరకు సమస్యల అవగాహన ఉంది. ఇవన్నీ కనీస అవగాహనా లేకుండా రాగానే ఎవరు ఓటేసి సీట్లో కూర్చోబెట్టేయరు. అంత ప్రజాభిమానం ఉన్న ఎన్టీఆర్ లాంటి వారికి కూడా ప్రజాక్షేత్రంలో కి వెళ్లి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ద్వారానే ఓట్లుగా మార్చుకోగలిగారు.

మనకు అంత ఉందా అనే ఆలోచన లేకుండా రాగానే సీఎం ను ఎందుకు చేయలేదు అని ప్రశ్నించడం నిజంగా అమాయకత్వం గానే ఉంది. అంత అమాయకత్వం ఉన్నవాడికి అధికారం ఇస్తే, అది ఎలా ఉంటుందో ప్రజలకు కూడా తెలుసు, అందుకే వాళ్ళు కూడా దూరంగా పెట్టారు. ప్రజాక్షేత్రంలో తిరిగలేని పక్షంలో రాజకీయ పార్టీ పెట్టడం వృధా. ప్రజల మనిషిగా ఉండగలిగితేనే వాళ్లలో ఆయా పార్టీ పైన ఒక నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు ఏదైనా మార్పు ఆయా పార్టీ తెస్తుంది అనేది వాళ్ళ మనసులలో కలిగి, ఓటుగా మారే అవకాశం ఉంది. లేదంటే ఎప్పటికి పార్టీ ఉన్నదనే పేరు తప్ప మరొక ప్రయోజనం ఉండబోదు. కొన్నాళ్ళకు అది కూడా ఎక్కడో అక్కడ కలిపేసి, మాములుగా పని చూసుకోవడం మేలనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: