దేశపరిస్థితుల దృష్ట్యా మొదటిసారి భారతప్రభుత్వం వెనకడుగు వేయాల్సి వచ్చింది. కరోనా లో రైతు ప్రాధాన్యత అందరికి అర్ధం అయ్యింది. అందుకే ఆ రైతు కష్టానికి ఫలితాలు తక్కువగా ఉన్నాయనే భావనతో రైతులకు మేలు చేసే చట్టాలు తెచ్చింది కేంద్రప్రభుత్వం. కానీ అవన్నీ సహించలేని విపక్షాలు తమ బ్రతుకులు ఏమైపోతాయో అనే స్వార్థబుద్ధితో ఇష్టానికి వాటిపై తప్పుడు ప్రచారం చేసి, రైతు నాయకులను తమకు అనుకూలంగా మార్చుకొని లేనిపోని ఉద్యమాలకు ఉపక్రమించేలా చేశాయి. అది గుర్తించిన కేంద్రప్రభుత్వం రైతు లతో చర్చించడానికి సిద్దపడినప్పుడల్లా, ఆయా రైతు నాయకులే రైతు  పక్షాన హాజరవుతుండటంతో చర్చలు సఫలం కాలేదు. దీనితో రైతు చట్టాలు కావాలనే విపక్షాలు దారిమళ్లిస్తున్నాయని తెలుసుకున్న కేంద్రం కాస్త మొండిగా ప్రవర్తించడం ఆరంభించింది.

ఇదంతా ఏపీలో మేము గెలిచాం, అంతా మేము చేసుకోగలం అనే ఆలోచనతో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నప్పుడు, అసలు వాళ్ళను అడుగు కూడా వేయకుండా విపక్షం తన చేతులలో ఉన్న వ్యవస్థలతో ఎలా అడ్డుకోగలిగిందో అలాగే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంపట్ల విపక్షాలు అంతే వ్యూహాత్మకంగా ప్రతిఘటించగలిగాయి. దానితో కేంద్రం పరిస్థితి వెనక్కి తగ్గాల్సినంత వరకు వచ్చేసింది. ఇదంతా ఈ రెండు పరిస్థితులలో విపక్షాలను తక్కువ అంచనా వేయడం వలన ఆయా ప్రభుత్వాల కు జరిగిన నష్టంగా భావించాల్సి ఉంది. వ్యవస్థలను ఎలా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనేది అడ్డం పెట్టుకొని పై రెండు సందర్భాలలో విపక్షాలు ప్రవర్తించాయి, ప్రభుత్వాలను అడుగు ముందుకు వేయనీయకుండా అడ్డుకున్నాయి. ఈ పరిస్థితి రాకుండా ఇకనైనా మేల్కొంటే ఇలాంటి దుస్థితి మరో దానిలో రాకుండా ఉంటుంది.

రైతులకు మేలు ఈరోజు కాకపోతే రేపు చేయొచ్చు, మరోరకంగా చేయొచ్చు. కానీ ఇంకా రైతు ఉద్యమం పేరుతో విపక్షాల ఆటలు కొనసాగనివ్వకూడదు అనే భావనతో బీజేపీ చట్టాలను రద్దుచేసింది. ఇక విపక్షాలు మరో కారణం వెతుక్కొని సమయంలో ప్రభుత్వం తన వ్యూహాలను అమలు చేయడం ద్వారా విపక్షాల నోరు నొక్కేయొచ్చు అనేది ప్రస్తుత ఆలోచన కావచ్చు. చూడాలి తదుపరి బీజేపీ ఆలోచన ఏమిటో అని. దీనిపై వెనక్కి తగ్గని కేంద్రం తగ్గిందంటే దానివెనుక ఎటువంటి కారణం లేకుండా మాత్రం చేసి ఉండదు అనేది ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకు తీరాలి. విపక్షాల జుట్టుగాని దొరికిందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: