వ్యవసాయ చట్టాలను ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఇప్పుడు దేశంలో విపక్షాలు అన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా విపక్షాలు సహా పలువురు ప్రముఖులు రైతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక దీనిపై తెలంగాణా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 13 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు అకుంఠిత దీక్ష తో పోరాటం చేశారు అని అన్నారు ఆయన. ప్రభుత్వం మెడలు వంచి.. నల్ల చెట్టలు వెనక్కి తీసుకునేలా పోరాటం చేశారు అని కొనియాడారు. దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా పోరాటం చేస్తారో... రైతులు కూడా అదే స్ఫూర్తి తో ఉద్యమం చేశారు రైతులు అని ఆయన కొనియాడారు.

 దేశంలో గుజరాత్ నుండి బయలు దేరిన నలుగురు దేశాన్ని అక్రమించుకోవలని చూస్తున్నారు అని విమర్శించారు. వ్యవసాయం అదాని..అంబానీకి అమ్మకం కి పెట్టాలని చూశారు  అని రేవంత్ మండిపడ్డారు. ఇందిరా గాంధీ పుట్టిన రోజున నల్ల చెట్టాలు రద్దుతో రైతులు విజయం అని ఆయన స్పష్టం చేసారు. మొదటి రోజే చేట్టలు వెనక్కి తీసుకుంటే రైతుల ప్రాణాలు మిగిలేవి అని అన్నారు రేవంత్. వందల మంది రైతులు ప్రాణాలు పోవడానికి మోడీనే కారణం అని  రేవంత్ ఆరోపణలు చేసారు. వందలాది మంది రైతుల ప్రాణాలు పోవడానికి కారణం అయిన నరరూప రాక్షసుడు మోడీ  అని సంచలన వ్యాఖ్యలు చేసారు.

రైతులు మోడీ నీ క్షమించరు అని కానీ మా ఎమ్మెల్యే లను బయటకు పంపారు అని మండిపడ్డారు. వ్యవసాయం సంక్షోభ కి కారణం మోడీ కెసిఆర్ అని విమర్శలు చేసారు. పార్లమెంట్ లో చట్టం కి అనుకూలంగా ఓటేశారు కెసిఆర్  అని అన్నారు రేవంత్.  సభలో చట్టాల కు వ్యతిరేకంగా తీర్మానం చేసే దైర్యం లేదు  అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కానీ క్రెడిట్ నాది అంటున్నారు అని అది రైతులను అవమానించడం  అన్నారు. ఎవడికో పుట్టిన పిల్లలను ... కుల్ల కుట్టించినట్టు ఉంది అని ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts