ఇటీవల రష్యా నుండి భారత్ ఎస్400 కొనుగోలు చేసినప్పుడు అమెరికా గొల్లుమనడం చూశాం. దాని బాధ తెలుసు కాబట్టి అక్కడి నుండి కూడా ఏదైనా కొంటె సరిపోతుందనే ఉద్దేశ్యంతో భారత్ సరికొత్త ప్రిడాటర్ డ్రోన్లను కొనుగోలు చేసింది. ఈ డ్రోన్లు ఎక్కడైనా సమూహంగా ఉన్న శత్రువులను ఒక్కసారిగా హతమార్చడానికి ఉపయోగిస్తారు. అంటే వీటిలో ఉన్న కెమెరా సాయంతో ఎక్కడైనా శత్రువులు గుంపులుగా ఉన్నారేమో చూస్తూ, ఉన్నారు అని కనిపించగానే దానిలో ఉన్న బాంబర్ ను యాక్టివేట్ చేసి అందరిని ఒక్కసారి చంపేయొచ్చు. అప్పుడు డ్రోన్ కూడా పేలిపోతుంది. దాదాపుగా తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులు మాదిరే, కాకపోతే ఇక్కడ డ్రోన్ లను వాడుతాం అంతే. ఇలా ఒక దేశంతో వాణిజ్యం చేయడం వలన మరో దేశం అలగకుండా కూడా తగిన జాగర్తలు వహిస్తుంది భారత్.

రష్యా నుండి ఎవరు ఆయుధాలు కొనుగోలు చేసినప్పటికీ అమెరికా వారిపై ఆంక్షలు పెడుతుంది. అలాగే భారత్ కూడా ఎస్400 కొనుగోలు చేసే ముందు కూడా దానిపై బాగా చర్చ నడిచింది. కానీ భారత్ మొండిగా కొనడంతో ఇప్పటికే అవి భారత్ కు చేరుకున్నాయి. అయినా అమెరికాలో పార్లమెంట్ వర్గాల మాటలతో ఏకీభవించిన అధ్యక్షుడు ఆంక్షలు పెట్టలేదు కానీ గొణగడం మాత్రం మానలేదు. అందుకే భారత్ ఆ దేశం నుండి కూడా ఏదైనా కొనాలని, అవసరం అనిపించిన డ్రోన్లను 21000కోట్లతో 30 వరకు కొనుగోలు చేసింది. ముందు చెప్పినట్టుగా ఇవన్నీ ఒక్కసారి వాడకానికి, పిలిస్తే అయిపోయినట్టే. ఇదో రకం బుజ్జగింపు అంతర్జాతీయంగా సహజం.

ఇలా భారత్ అంతర్జాతీయంగా కూడా తనకు ఎదురయ్యే సమస్యలను చాకచక్యంతో ఎదురుకొంటూ ముందుకు వెళ్తుంది. భారత్ వద్ద ముందుగానే ఎన్95 డ్రోన్లు ఇదేతరహావి ఉన్నప్పటికీ, అవి ఇతర ప్రాంతాలలో బాగా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం కొన్నవి సముద్ర పై భాగంలో ఉపయోగించడానికి ఉపయుక్తంగా ఉంటాయి. సముద్ర మార్గాలలో కూడా పాక్, చైనా ఇటీవల ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ధీటుగా ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటుంది భారత్.

మరింత సమాచారం తెలుసుకోండి: