బీజేపీ చేసిన రైతుచట్టాల మార్పు కేవలం రైతుల మేలుకోసమే. చదువు కున్నోళ్ళ కు కూడా ఇది అర్ధం కాలేదా, అలా నటించమని ఎవరైనా చెప్పిండ్రా సార్లు..!

ఒకరైతు దగ్గర ఒక ఉత్పత్తి అమ్ముడు అవుతుంది ఎంతకు?
దానిని వినియోగదారులు కొనుక్కుంటున్నది ఎంతకు?

ఈ రెండు ప్రశ్నలకు సమాధానం తెలిసిపోతే ఆ చట్టాల అసలు ఉద్దేశ్యం అర్ధం అవుతుంది. అంటే రైతు ఉద్యమం నడిపింది అంతా మధ్యవర్తులు కాబట్టి వాళ్లకు ఈ చట్టాలు గిట్టవు. అది సహజం. అందుకే అంత యాగీ చేశారు. ఇతర కారణాలు ఉండొచ్చు, అవి పక్కన పెట్టేసి, విషయం గురించి మాట్లాడుకుందాం.

గతంలో చట్టాలు అన్ని ఎప్పటివో అసలు తెలుసా? అవన్నీ బ్రిటిష్ కాలం నాటివి. అవన్నీ ఎంత డొల్లగా ఉన్నాయంటే, కేవలం మధ్యవర్తులు బాగుపడుతున్నారు తప్ప రైతు రోజురోజుకు చితికిపోతున్నాడు. ఇవన్నీ కరోనా తరువాత అయినా ప్రభుత్వం దృష్టికి రావడం, వాళ్ళు దానిపై స్పష్టమైన చట్టాలు తేవడం ఎంతో గొప్ప మార్పు. ఎవరైనా వచ్చి మా బ్రతుకులలో మార్పు తెస్తే బాగుండు అనుకుంటారు కానీ, తీరా దానిని చేస్తుంటే ఇతరుల చెప్పుడు మాటలు విని, తమ ప్రయోజనాలను తామే నాశనం చేస్తుకుంటారు. ప్రస్తుతం రైతు చట్టాల రద్దు అలాగే ఉంది.

మార్పులు తెచ్చే ప్రభుత్వం వస్తే బాగుండు అనుకుంటూ ఉన్నాం, తీరా వచ్చాక దానిని గుర్తించడం మానేసి, ఎవరి కోసం ఈ చట్టాలు అనే కనీస పరిజ్ఞానం తెచ్చుకోకుండా వద్దు అంటూ నిరసనలు, ఆందోళనలు. అవన్నీ మీరు చేయలేరని అందరికి తెలుసు, మీ పేరుతో కొందరు దుష్టశక్తులు చేస్తున్న యాగీ. వారికి దేశభక్తి కాదుకదా, కాస్త సొమ్ము ఇస్తే దేశాన్ని కూడా పదిపైసలకే అమ్మేసుకోగలరు. అలాంటి వాళ్లకు రైతు ఉద్యమంలో చేరి నానా యాగీ చేస్తుంటే, అది రేపటి రోజున మరింత ప్రమాదకరంగా భావించి, తొందరగా ఈ ఆందోలన విరమింపజేయడానికి చేసేది లేక వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఈ మాత్రం ప్రభుత్వ చట్టాలపై ఆయా మీడియా కూడా సరైన ప్రచారం చేయలేకపోయింది అంటే వాళ్ళు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో కూడా అర్ధం అవుతుంది.

ఒక ప్రయోజనం ఇన్నాళ్లకు రైతులకు అందుతుంటే దానిని చేజేతులారా నాశనం చేసిన పాపం అందరిదీ. రేపటి రోజున ఒక రైతు మధ్యవర్తి చేతిలో మోసపోయి చనిపోతే ఆ పాపం వీళ్లందరిదే. అందుకు అందరు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. రైతులు చదువుకోలేదు అనుకుంటే, ఇంతమంది విజ్ఞానవంతులు ఉన్నారు, వాళ్ళు వెళ్లి ఆయా రైతులకు నచ్చజెప్పలేకపోయారా లేక ఆయా చట్టాలపై స్పష్టత ఇవ్వలేకపోయారా .. ఇలా ఎన్నో ప్రశ్నలతో మరోసారి రైతు తన గోతిలో తాను ఉండిపోవాల్సి వస్తుంది. రైతుకు మేలు చేయాలి అనుకుంటే, ఇప్పటికైనా రైతు వద్ద నుండి సంఘాలుగా ఏర్పడిన ప్రజలు లేదా అపార్ట్మెంట్ వాళ్ళు ఉమ్మడిగా ఆయా రైతుల నుండి సరాసరి ఉత్పత్తులను కొనడానికి ప్రయత్నించడం ద్వారా ఈ తప్పును కాస్త సరిచేసుకోవచ్చు. ఇది దేశంలో అందరి బాధ్యత. నాకు చెప్పడం రాకపోయినా ఇప్పటికే ఇలాంటి సన్నివేశాలు ఎన్నో చిత్రాలలో వచ్చినవే. రైతును ఎలా ప్రజలు ఆడుకోవచ్చు అనేది ఆయా చిత్రాలలో చెప్పబడింది. ఉదాహరణకు మహేష్ బాబు చిత్రం మహర్షి. సినిమా పేరు చెప్పగానే సినిమాలలో జరిగినవి నిజజీవితంలో ఎలా అని తప్పించుకోకండి. అన్ని జరగకపోవచ్చు, కొన్ని సాధ్యమే. ముందు ప్రజలకు ఆయా సంకల్పం అంటూ ఉంటె, సాధ్యాసాధ్యాలు అవే జరిగిపోతాయి.


ఈ కొత్త చట్టాల ద్వారా రైతు తన కు నచ్చిన చోట తన ఉత్పత్తులు అమ్ముకోవచ్చు. లేదా ఎప్పటి లాగానే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద తన ఉత్పత్తిని అమ్మి గిట్టుబాటు ధర పొందవచ్చు. గతంలో లాగా మార్కెట్ యార్డులలో ఎంత చెపితే అంతకు అమ్ముకోవాల్సిన పనిలేదు. దళారులకు అమ్ముకొని నష్టపోవాల్సిన అవసరం ఉండబోదు. తమ ఉత్పత్తులను తామే అమ్ముకోవడానికి తగిన ఆన్ లైన్ విధానాన్ని ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తుంది. వీటన్నిటిలో కూడా ఏదైనా వివాదం వస్తే, దానిని సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ వద్ద పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. గతంలో లాగా సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మాహుతి చేసుకోవాల్సిన అగత్యం ఉండదు. ఇవన్నీ ముందు అందరు ఆచరణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఇందుకు కూడా ఏదైనా సవరణలు చేయాలని రైతులు కోరడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు మళ్ళీ రైతుల సమస్యలను బట్టి ఆయా సవరణలు చేయబడతాయి. అవన్నీ అర్ధం చేసుకోకుండానే మేధావుల బుర్రలు రద్దును కోరాయా!

ఇక నేతల పాత్ర, రైతు చట్టాలు చేసినప్పుడు అందరు సూపర్ అంటూ స్పీచ్ లు దంచి మరి ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు రైతులకు మద్దతు అంటున్నారు. పెద్ద పెద్ద నేతల నుండి ఐఏఎస్ లు కూడా ఇలాంటి స్పీచ్ లు ఇచ్చిన వారే. వాళ్ళ చదువు ఎందుకు మట్టిగొట్టుకోనా, సిగ్గుండాలి పేరు పక్కన ఐఏఎస్, ఐపీఎస్ అని పెట్టుకోవడానికి. నేతలకు సిగ్గులేదు, మీకేమైంది. చదువు సంకనాకిపోయిందా గాడిదల్లారా! మీరు రాజకీయ ప్రయోజనాలే చూసుకుంటున్నారు, మరి మీకెందుకు పేరు పక్కన ఆ డిజిగ్నేషన్. దిబ్బలో వేసుకోండి, ఛీ వెధవ బ్రతుకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: