ఏపీలో రాజకీయ పరిణామాలు కాస్త మారుతున్నట్లు కనిపిస్తున్నాయి...ఇప్పటికీ వైసీపీ హవా తగ్గలేదు గానీ, ప్రతిపక్ష టీడీపీ మాత్రం కాస్త పికప్ అవుతుందని మాత్రం తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయిన ఒక 10 శాతం వరకు పుంజుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏడు నెలల క్రితం జరిగిన పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అంతగా సత్తా చాటలేకపోయింది. ఘోరంగా విఫలమైంది. కానీ తాజాగా మినీ మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో మాత్రం కాస్త వైసీపీకి పోటీ ఇచ్చినట్లే కనిపిస్తోంది.

అలా అని వైసీపీ ఆధిక్యం పెద్దగా ఏమి తగ్గలేదు. కొన్ని స్థానాల్లో మాత్రం వైసీపీని టీడీపీ నిలువరించింది. అది కూడా కోస్తా, ఉత్తరాంధ్రల్లో టీడీపీ బలం కొంచెం పెరిగినట్లు కనిపిస్తోంది. అంటే ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు చూసుకుంటే వైసీపీ ఆధిక్యం ఉంది గానీ, అదే సమయంలో టీడీపీ కాస్త బలం పెంచుకుంది. ఇటు రాయలసీమలో అనంతపురం జిల్లాలో కూడా కొంచెం టీడీపీ పికప్ అయినట్లు తెలుస్తోంది.

కానీ అన్నీ జిల్లాల్లో వైసీపీ హవానే ఉంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ డామినేషన్ ఫుల్‌గా ఉంది. అసలు ఈ జిల్లాల్లో టీడీపీకి వైసీపీ ఏ మాత్రం చాన్స్ ఇవ్వడం లేదు. కాకపోతే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ కాస్త పికప్ అవ్వడంపై మాత్రం వైసీపీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ఎందుకంటే ఆ జిల్లాలే 2014 ఎన్నికల్లో కొంపముంచాయి.

ప్రకాశం నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీ హవా నడిచింది. అలాగే అనంతపురం జిల్లాలో కూడా టీడీపీ సత్తా చాటింది. అందుకే టీడీపీ అధికారంలోకి రాగలిగింది. వైసీపీ ఏమో నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలకే పరిమితమైంది. అయితే ఇప్పుడు ఆ జిల్లాల్లోనే టీడీపీ బలపడుతుంది. పైగా దానికి జనసేన సపోర్ట్ తోడు అవుతుంది. కాబట్టి వైసీపీ జాగ్రత్తగా ఉండి టీడీపీకి చెక్ పెట్టాలి...లేదంటే 2024లో 2014 సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: