ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు శాసనసభలో జరిగిన అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికార పార్టీని అన్ని విధాలుగా కూడా టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ నేడు జరిగిన అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకోవడంతో టిడిపి కార్యకర్తలు అధికార పార్టీ విషయంలో చాలా సీరియస్ గా ఉండటమే కాకుండా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో ఆరోపణలు చేసే పరిస్థితి కూడా ఉంది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేయడం టీడీపీ కీలక నేతల సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై ముందుకు వెళ్లడం శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరు ప్రజల్లోకి వెళ్లి ఎండగట్టే ప్రయత్నం చేయటం వంటివి ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళ కలిగితే మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి.

అదే విధంగా కొంతమంది మంత్రులు చేసిన వ్యాఖ్యలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి చంద్రబాబునాయుడు చేస్తున్న విమర్శలు కానీ టిడిపి నాయకులు చేస్తున్న విమర్శలు కానీ అధికారం వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు తిప్పికొట్ట లేకపోతున్నారు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది అధికార పార్టీ నాయకులు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా వ్యాఖ్యలు చేయకపోవడం అసలు ఏం జరిగింది ఏంటి అనేది ప్రజల్లోకి అర్థమయ్యే విధంగా తీసుకుని వెళ్ళ లేకపోవడం వంటివి ప్రధాన ఇబ్బందికరంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మరి భవిష్యత్తులో అయినా సరే ఏ విధంగా వైసిపి నాయకులు ఈ అంశాన్ని తిప్పికొడతారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: