ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళుతున్న లేదా అనే దానిపై ఆసక్తికర చర్చలు ఉన్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టత రావడం లేదు. జనసేన పార్టీ ప్రస్తుతం రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో వెనకడుగు వేస్తుంది అనే విషయం కొన్ని రోజులనుంచి క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది జనసేన పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లకపోవడం పార్టీ విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళ లేక పోవడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ మాదిరి రావడం కూడా పార్టీకి బాగా ఇబ్బందికర వాతావరణం రావచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ ఇప్పుడు అమరావతి ఉద్యమాన్ని తమకు అనుకూలంగా వాడుకొనే విషయంలో పెద్దగా విజయం సాధించలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీలో ఉన్న చాలామంది నాయకులు అమరావతి ఉద్యమానికి సంబంధించి కనీసం మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయకపోవడం వంటివి ప్రధాన సమస్యలుగా మారాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది కీలక నాయకులు కూడా ఈ మధ్యకాలంలో దూకుడుగా ముందుకు వెళ్ళడంతో జనసేన పార్టీ ప్రతిపక్షంగా ముందుకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

టిడిపిలో ఉన్న కొంతమంది కీలక నేతలు అన్ని నియోజకవర్గాల్లో యాక్టివ్ కావడంతో జనసేన పార్టీ ఏ సమస్య మీద మాట్లాడాలి ఏంటనే దానిపై ఒక స్పష్టత లేకుండా ఉంది అనే అభిప్రాయం కూడా. చాలా వరకు కూడా ప్రజా సమస్యల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎక్కువగా స్పందించడంతో జనసేన పార్టీకి రాజకీయంగా పెద్దగా ఆంధ్రప్రదేశ్ లో స్థానం కనబడడం లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కూడా పార్టీలో ఉన్న కీలక నేతలకు దిశానిర్దేశం చేసే విషయంలో సమర్థవంతంగా లేకపోవడం ఆ పార్టీ కార్యకర్తలను ప్రధానంగా వేధిస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: