ఆంధ్రప్రదేశ్ శాసన సభలో జరిగిన వ్యవహారం పట్ల ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయంగా టీడీపీ అధినేత అంశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటారని తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు నింపటానికి చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్ని కూడా సమర్ధవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన పరిణామాల్ని టిడిపి అలాగే చంద్రబాబు నాయుడు ఎంతవరకు ప్రజల్లోకి బలంగా తీసుకు వెళతారనేది ఆసక్తికర అంశం.

ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపిలో ఉన్న చాలామంది నాయకులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండక పోవడమే కాకుండా పదవులు తీసుకున్న వాళ్లు కూడా పెద్దగా తెలుగుదేశం పార్టీ ఉపయోగపడటం లేదు అనే అభిప్రాయం చాలా వరకు వ్యక్తమవుతోంది. రాజకీయంగా టిడిపిలో గత కొన్ని రోజుల నుంచి కొంతమంది సైలెంట్ గా ఉండడం ఆ పార్టీకి ప్రధాన దెబ్బ గా చెప్పుకోవచ్చు. తాజాగా అసెంబ్లీలో జరిగిన అంశం తెలుగుదేశం పార్టీకి మైలేజ్ తీసుకు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో టిడిపి నేతలు ఎంత వరకు ఉత్సాహంగా దీన్ని ప్రజల్లోకి తీసుకు వెళతారు అనేది తెలియాలి. చంద్రబాబు నాయుడు శాసనసభకు వచ్చేది లేదని ప్రకటన చేసిన నేపథ్యంలో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో టీడీపీ వెనకబడింది.

సోషల్ మీడియాలో కూడా పదవులు తీసుకున్న వాళ్ళు సైలెంట్ గా ఉండటంతో దాని గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. చాలామంది కీలక నాయకులు కూడా దీనికి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం గాని వారి వారి నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం గానూ సోషల్ మీడియా ఖాతాల్లో ఎక్కువగా వ్యాఖ్యలు చేయడం గానీ పెద్దగా చేయలేకపోతున్నారు. దీంతో ఈ అంశం గురించి పెద్దగా ప్రజల్లో చర్చ జరిగే పరిస్థితి కనపడక పోవటంతో టిడిపిలో కొంతమంది ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: