ఏపీ అసెంబ్లీలో నారా చంద్రబాబు సతీమణి పురందేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. ఈ అంశంపై బీజేపీ నాయకురాలు.. భువనేశ్వరి సోదరి పురందేశ్వరి స్పందించారు. భువనేశ్వరి తాను తోబుట్టువులమని గుర్తు చేసిన పురందేశ్వరి.. తాము చాలా విలువలతో పెరిగామని అన్నారు. భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని అన్నారు.  ఈ విషయాల్లో రాజీపడే ప్రసక్తే లేదని పురందేశ్వరి అన్నారు.


పురందేశ్వరి, భువనేశ్వరి ఇద్దరూ సొంత అక్కాచెళ్లెల్లన్న సంగతి తెలిసిందే. పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నా.. వ్యక్తిత్వాన్ని హరించే కామెంట్ల విషయంలో చెల్లికి అండగా నిలిచింది. ఈ విషయంలో పురందేశ్వరి మాత్రమే కాదు.. ఎందరో చంద్రబాబుకు అండగా నిలుస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మరో బీజేపీ నేత సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు.


మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్న సీఎం రమేశ్..  ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలను సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలాంటి నీచ సంస్కృతికి, దిగజారుడు రాజకీయాలకు దారితీసిన అధికార వైసీపీ పార్టీ తీరుని ప్రజలు అసహ్యించుకుంటున్నారని సీఎం రమేశ్ అన్నారు.


మరో వైపు అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో చంద్రబాబు చలించిపోయారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత బాధ ఎప్పుడూ భరించలేదన్నారు. ప్రజాక్షేత్రంలోనే అన్నీ తేల్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో తేల్చుకున్నాకే మళ్లీ శాసనసభకు వెళ్తానని చంద్రబాబు  తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. తాను చేసే ధర్మ పోరాటంలో ప్రజలు సహకరించాలని చంద్రబాబు  కోరారు. రెండున్నరేళ్ల  నుంచి అన్నివిధాలా అవమానిస్తున్నారన్న చంద్రబాబు.. ఎన్నో అవమానాలకు గురిచేసి బూతులు తిట్టినా సహించామన్నారు. ఇప్పుడు చంద్రబాబుకు అండగా నిలిచే నాయకుల సంఖ్య పెరిగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: