కంట‌త‌డి సానూభూతి తెప్పిస్తుంద‌నేది వాస్త‌వం.. కానీ, టీడీపీ అధినేత అసెంబ్లీ సాక్షిగా కంట‌త‌డి పెట్ట‌డం ఎలాంటి ప‌రిణాల‌కు దారితీస్తుంది.. సాక్ష్యాత్తు ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసి వ్య‌క్తి  అధికార ప‌క్షం నాయ‌కుల తీరుతో ఎక్కిఎక్కి ఏడ్చారు. అయితే, ఈ ఏడుపు వ‌ల్ల ఎవ‌రికి లాభం.? ఎవ‌రికి న‌ష్టం అనేది తేలాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో వైసీపీ హ‌వా కొనసాగుతోంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ ప్ర‌భావం తీవ్రంగా త‌గ్గిపోతోంది. అస‌లు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షంగా టీడీపీ ఉందా.. అనే అనుమానం క‌లుగుతోంది.



 వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌రిగిన ఏ ఎన్నిక‌ల్లోనూ సైకిల్ పార్టీ ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. మొన్న‌టికి మొన్న జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం మున్సిపాలిటీలో ఓట‌మి పాల‌యింది. అనంత‌రం నిర్వ‌హిస్తున్న‌ అసెంబ్లీ స‌మావేశాల్లో చంద్రబాబుకు తీవ్ర అవ‌మానం జ‌ర‌గ‌డం.. దీంతో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాల్లోకి వెళ్లి త‌న భార్య క్యారెక్ట‌ర్‌ను అవ‌మానించార‌ని, కుటుంబంపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, నా కుటుంబాన్ని రోడ్డుకు లాగుతున్నార‌ని మాట్లాడుతుండ‌గా.. స్పీక‌ర్ మైక్ చేయ‌డంతో బాబు అసెంబ్లీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.



అనంత‌రం ప్రెస్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన చంద్ర‌బాబు.. శాస‌న స‌భ‌లో జ‌రిగిన ప‌రిణామాల‌ను త‌ల‌చుకుని ఎక్కి ఎక్కి ఏడ్చారు.  అయితే, చంద్ర‌బాబుది దొంగ ఏడుపూ అంటూ వైసీపీ నాయ‌కులు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌రోప‌క్క బాబు ఏడుపుతో తెలుగుదేశం త‌మ్ముల్లు తీవ్ర ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. అలాగే, కుప్పం మున్సిప‌ల్ ఓట‌మి నుంచి ప్ర‌జ‌ల‌ను ఏమార్చ‌డానికే చంద్ర‌బాబు నాయుడు ఈ విధంగా చేశాడు అనే వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి.


బాబు ఏడుపు టీడీపీ సానుభూతి ప‌రుల‌ను మ‌ళ్లీ సైకిల్ పార్టీ వైపు మ‌ళ్లించే అవ‌కాశం కూడా ఉండ‌లేక‌పోలేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రోప‌క్క  ముఖ్యమంత్రి  స్థాయిలో ఉన్న వ్య‌క్తి దాంతో పాటు పార్టీ అధినేత‌గా ఉన్న చంద్ర‌బాబు  ఏడుపు ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో అసంతృప్తి ని పెంచే అవ‌కాశం ఉంద‌ని, దీంతో పార్టీపై న‌మ్మ‌కం పోతుంద‌నే అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. మొత్తానికి బాబు ఏడుపు వైసీపీ, టీడీపీ రెండు పార్టీల‌కు ఎంతో కొంత అనుకూల ప్ర‌తికూల ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: