రైతులకు ప్రధాన మంత్రి పధకం కింద ప్రతి ఏడాది సాయం అందుతున్న విషయం తెలిసిందే. ఈ సాయం అందడంలో అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి రావడంతో అందులో చిన్న మార్పులు చేయబడ్డాయి. ఆయా తాజా మార్పులకు అనుగుణంగానే ఈ పధకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలా కానీ పక్షంలో రైతుకు అందవలసిన 2000 రూపాయల సాయం అందబోదు. గతంలో ఈ పధకానికి దరఖాస్తు చేసుకునే ముందు ధ్రువపత్రాలు సాఫ్ట్ కాపీలు జతచేయడం జరుగుతుండేది. అలా చేయడం లో మోసాలకు పాల్పడుతూ, రైతులు కాకుండా మిగిలిన వారు ఈ లబ్ది పొందుతుండటంతో తాజా మార్పులు చోటుచేసుకున్నాయి. అందులో ముఖ్యంగా ధ్రువపత్రాలను పిడిఎఫ్ ఫార్మాట్ లో మాత్రమే జతచేయాలనేది ప్రాధాన్యమైన సూచన.

ఈ తాజా నిబంధన దరఖాస్తు విధానాన్ని మరింత సరళీకృతం చేయడంతో పాటుగా, రైతుకు సులభతరంగా కూడా ఉండనుంది. కేవలం దరఖాస్తు చేసుకోవడంలో చిన్న మార్పులు తప్ప  మరొకటి కాదు. ఒక్కసారి ఆధార్, సహా అందులో అడిగిన ధ్రువ పత్రాలు పిడిఎఫ్ ఫార్మాట్ లో జతచేయడం ద్వారా లబ్ధిదారులు పధకానికి సంబందించిన నగదు 2000 రూపాయలు పొందుటకు అర్హులు కాగలరు. గతంలో కొందరు రేషన్ కార్డు కూడా ధ్రువపత్రం కింద అందజేయడంలో విఫలం అయ్యారు. ఇది కూడా మోసాలకు పాల్పడటానికి అవకాశాలు లేవనెత్తడంతో, ఈ ధ్రువ పత్రాన్ని కూడా ఈసారి తప్పనిసరి చేసింది ప్రభుత్వం.

అంటే ఈసారి ఆధార్ సహా రేషన్ కార్డు నెంబర్ కూడా దరఖాస్తులో నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే పధకానికి అర్హులు. పదవ విడత కింద కేంద్రం నుండి సాయం అండగోరిన రైతులు తప్పని సరిగా తమ రేషన్ కార్డు నెంబర్ ను దరఖాస్తులో చేర్చి తీరాలి. అనంతరం దరఖాస్తుకు జతచేయగోరిన ధ్రువపత్రాలు కూడా పిడిఎఫ్ ఫార్మాట్ లో మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ఈ రెండు జాగర్తలు పాటించడంతో రైతులు యధావిధిగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పొందవచ్చు. ప్రస్తుత మార్పులు కూడా కేవలం పారదర్శకత పెంపొందించడానికి చేయబడ్డాయి. తద్వారా అర్హులైన అందరి రైతులకు ఈ పధకాన్ని అందించడంలో కేంద్రం సఫలీకృతం అవగలదు. ప్రతి ఏటా ప్రభుత్వం విడతల వారీగా రైతులకు 6000 రూపాయలు సాయం అందిస్తుంది. ఈసారి డిసెంబర్ 15 న ఈ పధకం అమలు చేయనున్నారు. అప్పటి కల్లా అర్హులు పై నిబంధనలు మేర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం 11.38 కోట్ల మంది రైతులకు 1.58 లక్షల కోట్ల రూపాయలు అందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: