టీడీపీ అధినేత మీడియా ముందు ఏడ్చేశారు. బహుశా ఎన్నికలలో ఓడినందుకేమో, ఓడినప్పుడల్లా అసలు కారణం సమీక్షించుకునే అలవాటు లేదు కానీ, ఈ కార్యక్రమం మాత్రం తప్పకుండ ఉంటుంది. అసలు ఆయనకు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని ఉంటె, ఇంతోటి బ్రహ్మరధం ఆయనకే పట్టేవారు, కానీ ఆయన నిరూపించుకోవడం మాని ప్రతిసారి దండుకోవడమే చేశారు. అందుకే ఇక భరించలేక పక్కన పెట్టేశారు ప్రజలు. ఇదంతా జరిగినందుకు ఏడిస్తే దానికి ఎవరు ఏమి చేయగలరు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉపఎన్నిక ఎలా జరిగిందో ఒక్కసారి పరికిస్తే, దానికంటే ఘోరంగా మాత్రం ఈ ప్రభుత్వంలో ఉపఎన్నిక జరిగిన వైనం పెద్దగా దుర్మార్గంగా జరిగిందని చెప్పడం వృధా.

ఆయన అధికారంలో ఉంటె ఒక చందాన, లేకపోతే మరో విధంగా ఆయన ప్రవర్తన ఉండటం షరా మాములే. అయినా ఓటమిని సమీక్షించుకునే అలవాటే లేని పార్టీ గా టీడీపీ మాత్రమే ఉంటుంది. అదికూడా కేవలం బాబోరి హయాంలో మాత్రమే. ఎక్కడ పార్టీ ఎంత చండాలం చేశాడో, ఈ ఘనతకు మాత్రం పెద్ద బహుమతి ఇవ్వాల్సిందే. అదే ఇచ్చారు ప్రజలు పార్టీ నేతలు. ఇక చాల్లే పక్కన కూర్చొని మనవాళ్లతో ఆడుకో అని. ప్రస్తుతం అంతకంటే దారేమి లేదు. ఈయన ఉండేది ఈ ఒక్క దఫాకే, తదుపరి టీడీపీ అధినేత మార్పు తప్పదు. ఇప్పుడప్పుడే టీడీపీ అధికారంలోకి రాదు. కనుక ఇదే బాబోరి ఆఖరి ఎన్నిక. అందుకే ఈ ఏడుపు అనుకుంటా.

దీనిపై పాపం తోకపార్టీ బాగా ఫీల్ అయినట్టే ఉంది. ఎప్పుడు బాబోరికి కష్టం వచ్చినా క్షణం ఆలస్యం చేయకుండా స్పందిస్తారు. అదే స్పందన కనీసం పార్టీ కోసం, పార్టీ కోసం కష్టపడుతున్న సేన కోసం ఏ ఒక్కనాడు చేసిన పాపాన పోలేదు. అదేం చోద్యమో. తోకగా ఉన్నాక ఆయన పై విశ్వాసం బాగా పెరిగినట్టే ఉందొ లేక ఓటమి పాలైన ఇద్దరు, నీది తెనాలి, నాది తెనాలి అన్నట్టు, నువ్వు ఓడిపోయావు, నేను ఓడిపోయాను అంటూ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటున్నారు కాబోలు. అంతకంటే చేసేది కూడా ఏమి లేదులే. ప్రస్తుతం పార్టీపై పట్టు సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ స్పందించని పవన్ గారు, బాబోరు ఏడుపు చూడగానే స్పందించారంటే, ఆయన కూడా మీడియా ముందు ఏడిస్తే బాగోదని, ఆయన రూమ్ లో ఇదే పని చేసినట్టుగా ఉంది ఓడిపోయిన తరువాత, అక్కడ సింక్ అయ్యి ఉండవచ్చు. అందుకే ఈ ఓదార్పు స్పందన కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: