చైనా లో ఒకదాని తరువాత మరోక సమస్య బయటకు వస్తుంది. గతంలో అసలు విషయం లేకపోయినా అలీబాబా సంస్థ యజమానిని కొన్నాళ్ళు కనిపించకుండా చేశారు.  అనంతరం ఆయన కనిపించే వరకు కూడా ఏమి జరిగింది అనేది తెలిసిందే లేదు. ఆయన హఠాత్తుగా ఒకరోజు మళ్ళీ కనిపించినప్పటికీ ఎక్కడకు వెళ్ళింది, ఏమి జరిగింది అనే వివరాలు తెలియకుండానే ఆ విషయం నుండి దృష్టి మారిపోయింది. ఇలా చైనా లో అధ్యక్షుడు ఏమి అనుకుంటే అది నిర్దాక్షిణ్యంగా జరగాలి తప్ప ఎవరికి స్వాతంత్రం ఉండదు. మళ్ళీ అది పేరుకు మాత్రం అతిపెద్ద కమ్మూనిస్టు సామ్రాజ్యం అని చెప్పుకుంటున్నారు. కమ్మూనిస్టులు అంటేనే మానవహక్కుల కోసం పోరాడేవారు, వాటికి ప్రాధాన్యత ఇచ్చేవారు. మరి అలవాటే ఆ దేశంలో కనిపించినప్పుడు దానిని కమ్మూనిస్టు ప్రభుత్వం అని ఎలా అంటున్నారో ఏమిటో? అంటే పెద్దోళ్ళు ఏమి చేసినా సరైపోద్దేమో, వాళ్ళు చెప్పిందే సత్యం కాబోలు!

తాజాగా చైనా లో మరో వివాదం వెలుగు చూస్తుంది. ఒక ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి పై లైంగిక వేధింపులు జరిగాయని, అదికూడా చైనా ఉపాధ్యక్షుడిపై ఆ ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు శూన్యంగా ఉన్నాయి. ఈ ఆరోపణలు వచ్చినప్పటి నుండి సదరు క్రీడాకారిణి కూడా కనిపించకపోవడం మరో వివాదానికి తెరలేపింది. మహిళల భద్రత గురించి చైనాలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాపారాల పేరుతో మహిళలకు జరిగిన అన్యాయంపై మాట్లాడలేకపోవడం సమంజసం కాదని అంతర్జాతీయ సమాజం, మహిళా సమాజం పేర్కొంటున్నాయి. బాధితురాలు కూడా కనిపించకుండా పోవడం పట్ల కూడా ప్రభుత్వం సరైన ప్రకటన చేయకపోవడం పట్ల అనేక అనుమానాలకు తావిస్తున్నట్టే ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో తోటి క్రీడాకారుణులు కూడా దీనిపై చైనాను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణలపై అలాగే ఆ వ్యక్తి కనిపించకపోవడంపై ప్రభుత్వం ఏమి సమాధానం చెప్పనుంది అని వాళ్ళు అడుగుతున్నారు. వీటన్నిటికీ చైనా ప్రభుత్వం సమాధానం ఇప్పటికి చెప్పకపోవడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. సరాసరి ఉపాధ్యక్షుడిపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం కేసును దారిమళ్లించడానికే చూస్తుందని అంతర్జాతీయ సమాజం అనుమానిస్తోంది. బాధితురాలు కూడా కనిపించకపోవడం ఏమిటని, అసలు సదరు వ్యక్తి గురించి వివరాలు కూడా లేకపోవడం ద్వారా ప్రభుత్వం ఎదో దాస్తున్నదని చైనాపై తాజాగా అనేక ఆరోపణలు తలెత్తుతున్నాయి. దీనిపై చైనా ఇంకా స్పందించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: