పోలాండ్ దేశం చొరబాటు దారులకు సరైన సమాధానం చెప్పింది. కానీ భారత్ లో అలాంటివి జరగకుండా చూసుకోవడానికి ప్రభుత్వం సరిహద్దులో రక్షణ దళాలలకు మరిన్ని అధికారాలు ఇచ్చింది. దానిని కూడా కొన్ని రాష్ట్రాలు తప్పుబట్టడం ద్వారా వారి కుంచిత బుద్దిని, దేశంపట్ల వారి నిర్లక్ష్యాన్ని స్పష్టం చేశాయి. ఎవరైనా చొరబాటు దారులను రాకుండా చూసుకోవడం మాములే. అయితే భారత్ లో ఇటీవల పరిస్థితి గ్రహించిన ఎవరైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తారు, కానీ కొన్ని బీజేపీ యేతర ప్రభుత్వాలు (రాజస్థాన్, బెంగాల్)పార్టీల మధ్య ఉన్న విబేధాలను దేశంపట్ల చూపిస్తూ, తాజాగా సరిహద్దులలో రక్షణ దళాలకు ఇచ్చిన అదనపు అధికారాలను తప్పు బట్టారు. ఇలాంటివి చేయడం ఎంతవరకు సబబు అనేది వారి విజ్ఞతకే వదిలేయడం కూడా తప్పే. అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణించి, కఠిన శిక్షలు వేయాల్సి ఉంది.

అందుకే దానినుండి కూడా తప్పించుకోవడానికే ఇటీవల దేశద్రోహం చట్టాన్ని కూడా రద్దు చేసే స్థితిని తెచ్చారు. అదే జరిగితే ఇలాంటి మూర్ఖులు ఎక్కువైపోగలరు అనేది న్యాయవ్యవస్థ స్వయంగా గుర్తెరిగి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. వాస్తవానికి ఇరాక్, ఇరాన్ ప్రాంతాలలో ప్రజలు వాళ్ళ దేశంలో జీవించడానికి కష్టంగా మారడంతో ఏదైనా స్వాతంత్రంగా బ్రతకడానికి అవకాశం ఉండే దేశాలకు వెళ్లదలచి పొరుగు దేశాల బాట పడుతున్నారు. అలాంటి వారికి స్థానం కల్పించాలని రష్యా బెదిరించినప్పటికీ పోలాండ్ లొంగలేదు. ఇంత చెప్తున్నా రష్యా కూడా ఆ దేశంలోకి రాబోయిన ఆఫ్ఘన్ లను వెనక్కు వెళ్లగొట్టింది. ఒకరు చెప్తారు గాని చేయరు అన్న చందాన, రష్యా అయితే ఏ చొరబాటు దారులకు స్థానం ఇవ్వదు కానీ, మిగిలిన వారు మాత్రం స్వాగతించాలి హెచ్చరికలు చేస్తారు, ఇదేమి విచిత్రమో!

ఎవడు ఎన్ని చెప్పినా తాము మాత్రం చొరబాటుదారులను స్థానం కల్పించలేమని పోలాండ్ స్పష్టంగా చెప్పేసింది. బెలూరస్ మీదుగా వాళ్ళందరూ పోలాండ్ రాబోతుండగా పోలాండ్ వెసులుబాటు ఇవ్వకుండా పొమ్మన్నది. ఒకరు ఇద్దరు కాదు 35000మంది రావడంతో పోలాండ్ అడ్డుకుంది. వచ్చేది రష్యా మీదనే కదా, మీరెందుకు వారికి స్థానం కల్పించకూడదు అని సూటిగా పోలాండ్ ప్రశించింది. అయినా ఇది మా అంతర్గత వ్యవహారం, ఎవడి హెచ్చరికలు మేము లెక్కచేయబోము అని చెప్పేసింది పోలాండ్. దానితో రష్యా కూడా పోలాండ్ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక, వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: