గుంటూరు పెద్దాయ‌న అంబ‌టి రాంబాబు త‌న‌దైన శైలిలో మాట్లాడారు. చంద్ర‌బాబు కార‌ణంగా ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడారు. దీంతో స‌భ‌లో జ‌రిగిందాని క‌న్నా బ‌య‌ట జ‌రిగిన మాట‌లే ఎక్కువ‌గా ఉన్నాయి. ఆ కార‌ణంగానో ఎవ‌రికి వారు మ‌రో మారు త‌మ త‌ప్పిదాల‌ను క‌ప్పి పుచ్చుకునే ప‌నులే చేశారు. చేస్తున్నారు కూడా! దీంతో విష‌యం కొన్నిసార్లు ప‌క్క‌దోవ పడుతోం ది. కొన్ని సార్లు అస‌లు విష‌యం అటుంచి కొస‌రు విష‌యాల‌న్నీ తెర‌పైకి వ‌స్తున్నాయి. ముఖ్యంగా అంబ‌టి రాంబాబు ఎప్ప‌టిలానే తెలుగుదేశం ను, చంద్ర‌బాబును టార్గెట్ చేసి మాట్లాడినా, వాక్చ‌తుర్యం అనే నెపంతో ఆయ‌న నెగ్గుకు రావొచ్చు గాక.

స‌భ‌లో జ‌రిగిన వాటికి, స‌భ‌లో జ‌ర‌గ‌ని వాటికి కూడా అంబ‌టి మాట్లాడుతూ పోయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. కేవ‌లం వాకౌట్ చేసేందుకే ఆయ‌న ఇవాళ స‌భ‌కు వ‌చ్చార‌ని వైసీపీ ఆరోపించినా, అందులో నిజం ఎంత‌న్న‌ది ఎలా వెల్ల‌డి కావాలి. ఎవ‌రు తేల్చాలి. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌తో కాలం వెళ్ల‌బుచ్చే ప్ర‌య‌త్నం అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ చేసినా దీని వ‌ల్ల పెద్ద ప్ర‌యోజ‌నం అయితే ఏమీ ఉండ‌దు.

కుటుంబ స‌భ్యుల ప్ర‌స్తావ‌న అన్న‌ది ఎవ‌రు తెచ్చారు. ఎవ‌రు ఎందుకు తెచ్చారు. బ‌హుశా! ఒక కార‌ణం తెర‌పైకి వ‌చ్చిందా.. ఎలా అయినా ఈ సెంటిమెంట్ రాజకీయాలు న‌డ‌పాల‌ని.. ఇరు వ‌ర్గాలూ భావించాయా.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి, అంత‌కుముందు నుంచి వెన్ను పోటు గురించి మాట్లాడుతూనే ఉంది. తాజాగా వైసీపీ ఆరోప‌ణ‌లు చేసింద‌ని త‌మ వ్య‌క్తిగ‌త జీవితాల‌ను స‌భాముఖంగా అన్న‌ద‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. అలా మాట్లాడ‌డం త‌ప్పు. అయితే గ‌తంలో రోజా కూడా
పెద్దాయ‌న విష‌య‌మై స‌భ్య‌త‌తో ప్ర‌వ‌ర్తించ‌లేద‌న్న విష‌యం గుర్తించాలి. 


ఇక కుప్పంతో స‌హా సీమ రాజ‌కీయాలను అంతా తానై న‌డుపుతున్న పెద్ది రెడ్డి కూడా పై స్థాయిలో మంచి రాజ‌కీయాలే చేశారు. కుప్పం మున్సిపాల్టీ గెలుపే కాకుండా బ‌ద్వేలు గెలుపు సంబంధిత మెజార్టీలో ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు.ఏమ‌యిన‌ప్ప‌టికీ అసెంబ్లీ లో అంబ‌టి, బ‌యట పెద్ది రెడ్డి మంచి శ‌క్తిమంత‌మ‌యిన రాజకీయాలే న‌డిపారు. ఓ విధంగా వైఎస్ జ‌గన్ కు కుడి, ఎడ‌మ భుజంలా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: