బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత బండి సంజయ్ క్రేజ్ పెరిగింది అనే వార్తలు వస్తున్నాయి. అయితే బండి సంజయ్ కొన్ని నిర్ణయాల విషయంలో సమర్థవంతంగా వ్యవహరించ లేకపోతున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. బండి సంజయ్ ఈ మధ్యకాలంలో బిజెపి నాయకులతో సమర్థవంతంగా ముందుకు వెళ్లలేక పోతున్నారా అని కొన్ని విభేదాలు పరిష్కరించే విషయంలో బండి సంజయ్ లో దూకుడు కనపడటం లేదని అంటున్నారు.

బండి సంజయ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీనీ  క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంది అనే మాట వాస్తవం. భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది కీలక నాయకులు కూడా తెలంగాణలో సమర్థవంతంగా ముందుకు వచ్చి పని చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు. బిజెపి లో ఉన్న కొంతమంది కీలక నాయకులు కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి సైలెంటుగా ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి బాగా కలిసివచ్చే అంశంగా కొంతమంది చెబుతున్నారు.

బండి సంజయ్ సలహాలు సూచనలను కొంతమంది నాయకులు పాటించకపోవడం నియోజకవర్గాలకు ఇన్చార్జిల నియామకం ఎప్పటికీ కూడా జరగక పోవడం అనేది బండి సంజయ్ లోపంగా కూడా కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వ పెద్దలు మరోసారి ఢిల్లీ పిలిచారని ఢిల్లీలో కీలక సమావేశం జరిగే అవకాశం ఉందని తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్ఛార్జ్ ను కూడా ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం సూచనలు కనపడుతున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి తెలంగాణ బీజేపీ లో త్వరలో జరగబోయే మార్పులు ఏంటి అనే దానిపై రాబోయే రెండు మూడు నెలల్లో క్లియర్ గా అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: