తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి రాజకీయ ఇప్పుడు కాస్త ఆసక్తిని రేపుతోంది. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేసే పరిస్థితి కనబడుతున్న సరే ఆ పార్టీలో ఉన్న నాయకులు మాత్రం ఆయనకు ఏ రూపంలో కూడా సహకరించే ప్రయత్నం చేయక పోవడం కాస్త ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడానికి రేవంత్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేస్తున్నా సరే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటీ ముట్టనట్టు గా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ మధ్యకాలంలో ఇబ్బంది పడుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పార్టీలో ఉన్న కొంతమంది కీలక నాయకులు బయటకు వెళ్లి పోయే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి వైఖరి నచ్చక చాలామంది నాయకులు పార్టీకి రాజీనామా చేయడానికి ఈ మధ్య కాలంలో కొంత మంది అనుచరులతో చర్చలు జరుపుతున్నారని పార్టీలో ఉన్న సీనియర్ నేతలు పార్టీ కోసం పని చేయడానికి ముందుకు రాకుండా టిఆర్ఎస్ పార్టీ తో స్నేహం చేస్తున్నారని ఆ పార్టీలోని కొంతమంది ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మినహా పెద్దగా ఎవరూ బయటకు రావడం లేదు.

కాంగ్రెస్ పార్టీలో యువ నాయకులు గా చెప్పుకునే వారు అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కొంతమంది కీలక నాయకులు కూడా బయటకు రాకపోవడంతో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని అంశాలు కాస్త చర్చనీయాంశంగా మారుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నా సరే సమర్థవంతంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే రేవంత్ రెడ్డి మాత్రం ఒంటరి పోరాటం చేయడం కాస్త ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: